రానా కాదా పవన్ సినిమాలో నానినా?

పవన్ కళ్యాణ్ శేఖర్ కె చంద్ర దర్శకత్వం లో మలయాళం అయ్యప్పన్ కోషియం రీమేక్ చెయ్యబోతున్నాడు. అయితే ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేకపోయినా… ప్రస్తుతం ఈ సినిమా [more]

;

Update: 2020-10-29 01:38 GMT
Nani
  • whatsapp icon

పవన్ కళ్యాణ్ శేఖర్ కె చంద్ర దర్శకత్వం లో మలయాళం అయ్యప్పన్ కోషియం రీమేక్ చెయ్యబోతున్నాడు. అయితే ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేకపోయినా… ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ని శేఖర్ పూర్తి చేసి పవన్ నుండి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడనే టాక్ ఉంది. అయితే అయ్యప్పన్ కోషియమ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా మరో హీరో ఉండాల్సి ఉంటే…ఆ హీరో పాత్రలో రానా నటిస్తాడని టాక్ సోషల్ మీడియాలో ఎప్పటినుండో ప్రచారంలో ఉండగా..ఈ సినిమా ప్రకటించి రెండు మూడు రోజులైన రానా ఈ సినెమా విషయంలో ప్రకటన ఇవ్వకపోవడం, అసలు ఈ సినిమాపై రానా స్పందించకపోవడం చూసిన వారు రానా పవన్ కళ్యాణ్ మలయాళ రీమేక్ లో నటించడం లేదేమో అనే అనుమానం వ్వ్యక్తం చేస్తున్నారు.

పవన్ తో సినిమా అంటే రానా ఊరుకుంటాడా? తన ఆత్రాన్ని ఈపాటికి అభిమానులకు షేర్ చేసేవాడే. అయితే రానా కాకపోతే పవన్ సినిమాలో మరో హీరోగా నాని నటించవచ్చేమో అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయ్యప్పన్ కోషియమ్ సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే పవన్ సినిమాలో కేరెక్టర్ అనగానే నేచురల్ స్టార్ నాని ఓకే చెప్పెయ్యొచ్చు. అలాగే ఈ సినిమాలో పవన్ తో నాని కలబడవచ్చేమో అనే రూమర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి పవన్ సినిమాలో రానానా? లేదా నానినా? అని తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News