అందం కోసం ఆయుర్వేదమా

అప్పట్లో రజినీకాంత్ చంద్రముఖి సినిమాలోనూ, సూర్య గజినీ సినిమాలోనూ చూసిన నయనతార ఇప్పటికీ అంటే 34 ఏళ్ళ వయసులోనూ అంతే అందంతో మెరిసిపోతుంది. శింబు, ప్రభుదేవాతో ప్రేమ [more]

Update: 2019-10-15 06:24 GMT

అప్పట్లో రజినీకాంత్ చంద్రముఖి సినిమాలోనూ, సూర్య గజినీ సినిమాలోనూ చూసిన నయనతార ఇప్పటికీ అంటే 34 ఏళ్ళ వయసులోనూ అంతే అందంతో మెరిసిపోతుంది. శింబు, ప్రభుదేవాతో ప్రేమ పెటాకులైనా దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం మాత్రం పటిష్ఠంగా ఉంది. ఈ డిసెంబర్ లో వీరిద్దరూ కలిసి పెళ్లి పీటలెక్కబోతున్నారని కూడా ప్రచారం మొదలైంది. నయనతార స్టార్ట్ హీరోల సినిమా ల్లోనే కాదు. కుర్ర హీరోల సినిమాల్లోనూ హీరోయిన్ గా రచ్చ చేస్తుంది. కుర్ర హీరోలకు సరిపోయే అందంతో నయన్ ఇప్పటికి ఓ వెలుగు వెలుగుతుంది.

స్పెషల్ ఫోకస్…..

ఇప్పటి వరకు జిమ్స్, యోగాలంటూ గడిపిన నయనతార ఇన్నాళ్ళకి తన అందం మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. సైరా సినిమాలో చిరు భార్యగా సిద్దమ్మ పాత్ర చేసిన నయన్ కి ఆ పాత్ర ని చూసుకుంటే ఆమె వయసు ఎక్కువగా కనబడుతున్నట్లుగా ఫీల్ అయ్యి తాజాగా అందంపై స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టిందట. అందాన్ని మెరుగులు దిద్దడానికి గాను అమ్మడు కేరళ ఆయుర్వేదాన్ని నమ్ముకుందని అందుకే నయనతార కేరళ పయనమైందని తెలుస్తుంది. తనకన్నా ఏడాది చిన్నవాడైన విగ్నేష్ శివన్ ముందు చిన్న పిల్లల కనబడాలనే తాపత్రయంతో నయనతార ఇలా కేరళ వైద్యాన్ని సంప్రదించింది అని అంటున్నారు.

 

Tags:    

Similar News