విజయ్ అయితే ఏంటి? చిరు అయితే ఏంటి?

లేడీ సూపర్ స్టార్ నయనతారని ఎప్పటినుండో ఓ విమర్శ వెంటాడుతుంది. అదే ఆమె సినిమా ప్రమోషన్స్ కి రాకపోవడం. భారీ లెవెల్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది కానీ [more]

Update: 2019-09-21 10:06 GMT

లేడీ సూపర్ స్టార్ నయనతారని ఎప్పటినుండో ఓ విమర్శ వెంటాడుతుంది. అదే ఆమె సినిమా ప్రమోషన్స్ కి రాకపోవడం. భారీ లెవెల్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది కానీ ప్రమోషన్స్ మాట వస్తే మాత్రం అందనంత దూరంకి వెళ్ళిపోతుంది. మొదటి నుంచి నయన్ తన సొంత సినిమాల ప్రమోషన్స్ కి రాదు. అయితే ఇలా ఎందుకు మీరు పబ్లిసిటీ చేసేందుకు రారు అని అడిగితే ” నేను ఎందుకు రావాలి” అని ఎదురు ప్రశ్న వేసిన సందర్బాలు కూడా ఉన్నాయి.

నయనా….. ఏమిటీ ఈ గోల

రీసెంట్ గా ఈమె తమిళ స్టార్ హీరో విజయ్ తో బిగిల్ అండ్ చిరుతో సైరా అనే సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ కి నయన్ కచ్చితంగా అటెండ్ అవుతుందనుకున్నారు కానీ రెండు రోజుల కిందట చెన్నై లో గ్రాండ్ గా జరిగిన బిగిల్ ఆడియో లాంచ్ కి నయన్ రాలేదు. మరో రెండు రోజుల్లో ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున జరుగబోతున్న సైరా చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో అయినా ఈమె పాల్గొంటుందా అనే చర్చ జరుగుతోంది. విజయ్ సినిమాకే రాలేదు ఇంకా చిరు సినిమా కి ఎలా వస్తుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చరణ్ మాత్రం ఆమెను ఈ మెగా ఈవెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె గొప్ప నటే అవ్వచ్చు కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఎన్ని చెప్పినా నయన్ తన బిహేవియర్ ని మార్చుకోదు.

 

Tags:    

Similar News