రెండుసార్లు మోసపోయింది.. మూడోసారి

నయనతారని దర్శకుడు మురుగదాస్ గజినీ టైం లో మంచి పాత్ర ఇస్తా అని చెప్పి.. కేవలం సెకండ్ హీరోయిన్ కె పరిమితం చేయడంపై నయనతార మురుగదాస్ పై [more]

Update: 2020-01-18 03:59 GMT

నయనతారని దర్శకుడు మురుగదాస్ గజినీ టైం లో మంచి పాత్ర ఇస్తా అని చెప్పి.. కేవలం సెకండ్ హీరోయిన్ కె పరిమితం చేయడంపై నయనతార మురుగదాస్ పై ఫైర్ అయినా సంగతి తెలిసిందే. అయితే ఒకసారి మోసపోయిన నయనతార రెండోసారి రజినీకాంత్ కి జోడిగా అంటే సినిమాలో తనకే ఇంపార్టెన్స్ ఉంటుంది.. రజిని తర్వాత తన పాత్రే హైలెట్ అవుతుంది అనుకుని మురుగదాస్ తో మళ్ళీ పనిచేయడానికి ఒప్పుకుంది. కానీ మురుగదాస్ మాత్రం నయనతారని రెండోసారి మోసం చేసాడనే విషయం దర్బార్ సినిమా చూస్తే తెలుస్తుంది. దర్బార్ లో నయన్ కి చెప్పిన పాత్రకి.. తీసిన పాత్రకి సెట్ అయినా.. ఎడిటింగ్ లో మాత్రం నయనతార సన్నివేశాలను చాలానే లేపేసారట.

అందుకే దర్బార్ లో నయనతార నామమాత్రపు హీరోయిన్ గా మిగిలిపోయి మురుగదాస్ చేతిలో రెండోసారి మోసపోయింది. కేవలం గ్లామర్ పరంగా మత్రమే వాడుకున్న నయనతార ని మురుగదాస్.. దర్బార్ లో రజినికో హీరోయిన్ ఉండాలి కాబట్టి స్టార్ హీరోయిన్ నయన్ ని తీసుకున్నామన్నట్టుగా ఆమె పాత్రని పరిమితం చేసాడు. ఇక సినిమా విడుదలయ్యాక నయనతార మురుగ మీద మళ్ళి అప్సెట్ అయ్యిందని… నయనతార అభిమానులు మురుగ మీద ఆగ్రహంగా ఉన్నారనే విషయం ఆ నోటా ఈనోటా మురుగకి తెలియడంతో.. రెండుసార్లు ఆమెకి ఇవ్వాల్సిన పాత్ర ఇచ్చా.. ఈసారి నయనతార తో ఫుల్లెన్త్ లేడి ఓరియెంటెడ్ మూవీ తీసి ఆమెకి హిట్ ఇస్తా అంటున్నాడట. కానీ నయనతార మాత్రం మూడోసారి మోసపోవడానికి రేడి అవుతుందో లేదో అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు నెటిజెన్లు.

Tags:    

Similar News