ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ తల్లిదండ్రులయ్యారు. ఆదివారం, అక్టోబర్ 9న విఘ్నేష్ శివన్ ట్విట్టర్ ద్వారా ఈ శుభవార్త పంచుకున్నారు. తమ పిల్లలతో ఆ జంట ఉన్న ఫోటోను పోస్టు చేశారు. ఇది అభిమానులలో ఆనందాన్ని నింపింది. చిరంజీవి టైటిల్ రోల్‌లో నటించిన గాడ్ ఫాదర్ లో నయనతార ఇటీవల కనిపించింది. అక్టోబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను అందుకుంది.
ఈ ఏడాది ప్రారంభంలో నటి నయనతారను వివాహం చేసుకున్న విఘ్నేష్ శివన్, తమకు ఇద్దరు కవల మగపిల్లలు పుట్టారని ట్విట్టర్‌లో వెల్లడించారు. వారి పిల్లలకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. "Nayan & Me have become Amma & Appa We are blessed withtwin baby Boys All Our prayers,our ancestors blessings combined wit all the good manifestations made, have come 2gethr in the form Of 2 blessed babies for usNeed all ur blessings for our Uyir& Ulagam.(sic)" అంటూ పోస్టు పెట్టారు.
2022 జూన్ 9న ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు నయనతార మళ్ళీ సినిమా షూటింగ్స్ లో బిజీ అయిపోయింది. ఆ తర్వాత నెల రోజులకు పైగానే ఇద్దరు దుబాయ్ వెళ్లి హనీమూన్ చేసుకున్నారు. సరోగసి పద్ధతిలో విగ్నేష్ శివన్, నయనతార అమ్మానాన్నలు అయ్యారు. ఈ జంటకు ఇద్దరూ మగ బిడ్డలు పుట్టారు.