రాముడి లాంటి భర్త కావాలట!!
హాట్ గర్ల్ నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత టాలీవుడ్ ని దున్నేస్తుంది అనుకుంటే.. నిధి కెరీర్ మామూలుగానే ఉంది కానీ.. ఏమంత గొప్పగా లేదు. [more]
హాట్ గర్ల్ నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత టాలీవుడ్ ని దున్నేస్తుంది అనుకుంటే.. నిధి కెరీర్ మామూలుగానే ఉంది కానీ.. ఏమంత గొప్పగా లేదు. [more]
హాట్ గర్ల్ నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత టాలీవుడ్ ని దున్నేస్తుంది అనుకుంటే.. నిధి కెరీర్ మామూలుగానే ఉంది కానీ.. ఏమంత గొప్పగా లేదు. అయితే తాజాగా గల్లా జయదేవ్ సినిమాలో నిధి అగర్వాల్ హాట్ గానే కనబడుతుంది. అయితే నిధి అగర్వాల్ ని చేసుకోబోయే వాడు ఎలా ఉండాలో చెబుతుంది. అందరి ఆడపిల్లల్లాగానే నిధి అగర్వాల్ కి రాముడి లాంటి భర్త కావాలట. రాముడి లాంటి భర్త అయితే ఏక పత్ని వ్రతుడు కాబట్టి అందరూ రాముడి లాంటి భర్తనే కోరుకుంటారు. నిధి కూడా రాముడి లాంటి భర్తనే కోరుకుంటుంది.
అందులోని సిక్స్ ప్యాక్ రాముడైతే మరీ మంచిది అంటుంది. అయితే నేను చేసుకోబోయేవాడు అలా ఉండాలి.. ఇలా ఉండాలి అనే కోరికలు ఏమి లేవు. కాకపోతే నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచుతూ నవ్వించే వాడైతే కావాలనిపిస్తుంది. ఇక ఇలా ఉంటె బావుంటుంది అనే డ్రీం కూడా ఉంది. పెళ్లి తర్వాత చాలా సింపుల్ గా ఇంటి భోజనంలో లేదంటే ఏదైనా జంక్ ఫుడ్ తింటూనే టివి చూస్తూ ఒకరికొకరం కబుర్లు చెప్పుకుంటూ గడిపెయ్యాలన్నది నా కోరిక అంటూ తనకి కాబోయే వరుడికి ఉండాల్సిన లక్షణాలు, పెళ్లి తర్వాత భర్త ఎలా ఉండాలనుకుందో చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.