పవన్ సినిమా అనేది నా కల!

అక్కినేని అన్నదమ్ములతో కలిసి సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల్లో హాట్ గా గ్లామర్ షో చేసినా రాని క్రేజ్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే ఒకే [more]

;

Update: 2021-02-05 06:36 GMT
Nidhi Agarwal
  • whatsapp icon

అక్కినేని అన్నదమ్ములతో కలిసి సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల్లో హాట్ గా గ్లామర్ షో చేసినా రాని క్రేజ్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే ఒకే ఒక్క సినిమాతో గ్లామర్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది నిధి అగర్వాల్. ఇస్మార్ట్ హిట్ తర్వాత నిధి అగర్వాల్ రేంజ్ మారిపోతుంది.. కెరీర్ లో దూసుకుపోతుంది అనుకుంటే.. అశోక్ గల్లా సినిమా తప్ప నిధికి దక్కిన మరో అవకాశం లేదంటే నమ్మాలి. ఎంత గ్లామర్ గా హాట్ గా సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఫోటో షూట్స్ షేర్ చేసినా అమ్మడు గ్లామర్ కి ఎవరూ పడలేదు. అందాల ఆరబోతలో అడ్డు అదుపులేని నిధి కి ఇప్పటివరకు ఓ అనుకునేంత ఆఫర్ రాలేదు. కానీ దర్శకుడు క్రిష్ నిధి అగర్వాల్ ని పవన్ సినిమా కోసం అనుకుంటున్నాడు అనగానే అందరి చూపు నిధి మీదే పడింది. నిధి కి లక్కీ ఛాన్స్ దోరికింది అంటున్నారు.
తాజాగా నిధి అగర్వాల్ కూడా అదే చెబుతుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నటించడం అనేది నా కల. ఇప్పుడు నా కల నిజం కాబోతుంది. పవన్ – క్రిష్ కాంబో సినిమా నాది తొమ్మిదో సినిమా అవుతుంది. పవన్ కళ్యాణ్ తో నేను నటించబోయే సినిమా నా కెరీర్ లోనే గోల్డెన్ ఫిలిం గా నిలిచిపోతుంది. పవన్ కళ్యాణ్ గారితో నటించే అవకాశం నాకు ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు అంటూ నిధి అగర్వాల్ కి పవన్ సినిమాలో నటిస్తున్నా అనే ఆనందాన్ని ఇలా మాటల రూపంలో బయటపెట్టింది. మరి త్వరలోపునే పవన్ తో కలిసి నిధి.. క్రిష్ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతుంది. అప్పుడు ఇంకెంత ఎగ్జైట్ అవుతుందో?

Tags:    

Similar News