భీష్మ సినిమాకి 10 కోట్ల లాభాలా?

సంక్రాంతి తరువాత ఒక్క చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. గత వారం విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫెమస్ లవర్ కూడా తుస్ మంది. ఇక తాజాగా [more]

Update: 2020-02-17 09:49 GMT

సంక్రాంతి తరువాత ఒక్క చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. గత వారం విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫెమస్ లవర్ కూడా తుస్ మంది. ఇక తాజాగా నితిన్ – రష్మీకల భీష్మ సినిమాపైనే ట్రేడ్ నిపుణులు, ప్రేక్షకుల ఆశలు పెట్టుకున్నారు. పాజిటివ్ బజ్ ఉన్న ఈ చిత్రం మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తి చేసింది. ఈ చిత్రం యొక్క అన్ని ఏరియాల హక్కులు, నాన్-థియేట్రికల్ హక్కులతో సహా 35 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక చిత్రం విడుదలకు ముందే భీష్మ నిర్మాత 10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ సంపాదించినట్లుగా తెలుస్తుంది. ఈ భీష్మ సినిమాకి 25 కోట్ల బడ్జెట్ పెట్టారని.. అలా చూసుకుంటే 10 కోట్లు లాభమొచ్చినట్లే అంటున్నారు.

ఏరియా: ప్రీ రిలీజ్ బిజినెస్ (కోట్లలో)
నైజాం 4.5
ఆంధ్ర 8.0
సీడెడ్ 2.0
ఇతర ప్రాంతాలు 5.5

నాన్-థియేట్రికల్ హక్కులు 15.00 కోట్లు

గ్రాండ్ మొత్తం: 35.00 కోట్లు

Tags:    

Similar News