బిగ్ బాస్ 4కి కంటెస్టెంట్స్ కొరత?
తెలుగులో అయినా, తమిళ్ అయినా, మలయాళం అయినా, బాలీవుడ్ అయినా ఈపాటికి బుల్లితెర మీద బిగ్ బాస్ సందడి కనబడేది. కానీ కరోనా కారణంగా ఇప్పుడు బిగ్ [more]
తెలుగులో అయినా, తమిళ్ అయినా, మలయాళం అయినా, బాలీవుడ్ అయినా ఈపాటికి బుల్లితెర మీద బిగ్ బాస్ సందడి కనబడేది. కానీ కరోనా కారణంగా ఇప్పుడు బిగ్ [more]
తెలుగులో అయినా, తమిళ్ అయినా, మలయాళం అయినా, బాలీవుడ్ అయినా ఈపాటికి బుల్లితెర మీద బిగ్ బాస్ సందడి కనబడేది. కానీ కరోనా కారణంగా ఇప్పుడు బిగ్ బాస్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఈలోపు బిగ్ బాస్ సీజన్స్ మీద బోలెడన్ని వార్తలు. అయితే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4 మీద రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలోకొస్తుంది. సీజన్ 4 కి తెలుగులో నాగార్జున కాకుండా విజయ్ దేవరకొండ, సమంత లలో ఎవరో ఒకరు హోస్ట్ చేస్తారనే న్యూస్ నడిచినా ఫైనల్ గా నాగార్జునే సీజన్ 4 హోస్ట్ అని స్టార్ మా కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక కంటెస్టెంట్స్ విషయంలో ఇప్పుడు ఓ ఆసక్తికర న్యూస్ వినబడుతుంది.
హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక గ్లామర్ షో చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తోన్న శ్రద్ద దాస్ సీజన్ 4 కి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్లోకి మొదటగా అడుగుపెట్టబోతుంది అని.. అలాగే యాంకర్ లాస్య, బిత్తిరి సత్తి లాంటి సెలబ్రిటీస్ బిగ్ బాస్ సీజన్ 4 కి వెళుతున్నారని ప్రచారం ఉన్నప్పటికీ.. ఇప్పుడు తాజాగా కరోనా ఇలా ఉన్న టైం లో వాళ్ళెంత ఇచ్చినా హౌస్ లోకి వెళ్ళేది లేదని కొంతమంది ఫైనల్ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ అనుకుంటున్నారట. బిగ్ బాస్ లోకి వెళితే కొంతమందికే ప్రాధాన్యత ఉంటుంది. ఎలాగూ కరోనా. మనకెందుకులే బిగ్ బాస్ అంటున్నారట. అసలు ఈ ఏడాది బిగ్ బాస్ ఉంటుందో లేదో అనే అనుమానము కలుగుతుందని అనే ఆలోచనలో కొంతమంది ఉన్నారట. మరి బిగ్ బాస్ సీజన్ 4 కి ఎంపిక చేసిన వారే ఇలా అనుకుంటుంటే.. కొత్తగా తీసుకోవడానికి స్టార్ మా ప్రయత్నాలు మొదలెడితే వారు మాత్రం ఒప్పుకోవాలిగా… చూద్దాం.