ఇదే బెటర్ అంటున్న పవన్ ఫాన్స్!!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ గురించి పవన్ కళ్యాణ్ ఫాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్లుగా సినిమాలకు దూరంగా [more]

Update: 2020-06-09 05:46 GMT

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ గురించి పవన్ కళ్యాణ్ ఫాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్లుగా సినిమాలకు దూరంగా ఉండడంతో.. పవన్ ఫాన్స్ వెర్రెక్కిపోయి ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీని బాలీవుడ్ పింక్ రీమేక్ చెయ్యడంతో.. ఆ సినీమాపై అంతగా అంచనాలు రావడం లేదు. అందులోను మే లోనే విడుదల కావాల్సిన సినిమా కరోనా తో పోస్ట్ పోన్ అవడం కూడా వకీల్ సాబ్ మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ తగ్గడానికి కారణమైంది. పవన్ గత సినిమాలకున్న క్రేజ్ వకీల్ సాబ్ పై రావడం లేదు.

అయితే పవన్ ఫాన్స్ మాత్రం మా వకీల్ సాబ్ కి హైప్ రాకపోతేనే బెటర్ అంటున్నారట. ఎంతో హైప్ తో క్రేజ్ తో విడుదలైన అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ అయినప్పుడు ఈ సినిమాకొచ్చిన క్రేజ్ చూసి పవన్ ఫాన్స్ బాగా హార్ట్ అయ్యారు . అందుకే వకీల్ సాబ్ కి క్రేజ్ వద్దు, హైప్ అవద్దు ఈ రేంజ్ లోనే సినిమా విడుదలైన రికార్డులు కొల్లగొట్టాలను పవన్ ఫాన్స్ భావన అట. మరో పక్క ఈ సినిమా సబ్జెక్టు కూడా పక్కా కమర్షియల్ అంశాలకు దూరంగా ఉండడంతో.. ఈ సినిమా పై భరీ అంచనాలు మరి ఎక్కువ అయితే.. చివరికీ పవన్ ఫ్యాన్సే నిరాశ పడే అవకాశం ఉంది. కాబట్టి వకీల్ సాబ్ కు భారీ అంచనాలు లేకపోవడమే మంచింది.. అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. 

Tags:    

Similar News