ఫైటర్ మాట్లాడటం లేదేమిటి?

బాలీవుడ్, టాలీవుడ్ హీరోలంతా కరోనా కి కంగారు పడకుండా సినిమా షూటింగ్స్ కోసం సెట్స్ మీదకెలుతున్నారు. మీడియం రేంజ్ హీరోలైన సాయి ధరమ్ తేజ్, నాగ చైతన్య, [more]

;

Update: 2020-09-15 06:58 GMT
PURI JAGANNADH
  • whatsapp icon

బాలీవుడ్, టాలీవుడ్ హీరోలంతా కరోనా కి కంగారు పడకుండా సినిమా షూటింగ్స్ కోసం సెట్స్ మీదకెలుతున్నారు. మీడియం రేంజ్ హీరోలైన సాయి ధరమ్ తేజ్, నాగ చైతన్య, సీనియర్ హీరో నాగ్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోలంతా తమ సినిమా షూటింగ్స్ పూర్తి చేసేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ – రామ్ చరణ్ లా సైలెంట్ గా కనబడుతున్నారు పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ. ఫైటర్ సినిమా ముచ్చట్లు బయటికి రావడం లేదు. కరోనా లాక్ డౌన్ మొదలవడంతో పూరి అండ్ ఛార్మి – విజయ్ లు ఫైటర్ కి ప్యాకప్ చెప్పి హైదరాబాద్ వచ్చేసారు. కానీ ఇప్పటివరకు ఫైటర్ షూటింగ్ విషయమై ఎవరి పెదవి విప్పలేదు. విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ బట్టల ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు

ఇక పూరి పూరి మ్యుసింగ్స్ అంటూ హడావిడి చెయ్యడం, పూరి చేసే మ్యుసింగ్స్ ని ఛార్మి షేర్ చెయ్యడం చూస్తున్నాం. కానీ ముంబై లో జరగబోయే ఫైటర్ షూటింగ్ విషయం మాత్రం తేలడం లేదు. మరోపక్క కరణ్ జోహార్ గాయబ్. సుశాంత్ సింగ్ మరణం తర్వాత కరణ్ కనబడం లేదు. ఒకపక్క కరోనా ఉన్నా ముంబై లో షూటింగ్స్ మొదలవుతున్నాయి. ఇక ఫైటర్ కథ మర్చి రామోజీ ఫిలిం సిటీలోనే షూట్ జరుపుతారని జరిగిన ప్రచారానికి ఛార్మి ఫుల్ స్టాప్ పెట్టింది. కథలో నో చేంజెస్.. ముంబైలోనే షూటింగ్ అంది. త్వరలోనే టైటిల్ చెబుతామని చెప్పింది కానీ.. టైటిల్ ఇంకా బయటికి రాలేదు. మరి హీరోలంతా షూటింగ్ అంటుంటే విజయ్ – పూరీలు ఎప్పుడు సిద్దమవుతారో చూడాలి.

Tags:    

Similar News