పాన్ ఇండియా లేదు.. పాడు లేదు?
రాజమౌళి తో మహేష్ సినిమా ఇది పక్కా. అందులో ఎలాంటి డౌట్ లేదు. రాజమౌళి స్వయంగా ఎనౌన్స్ చేసాడు. కానీ మహేష్ ఎక్కడా రాజమౌళి సినిమా విషయమై [more]
రాజమౌళి తో మహేష్ సినిమా ఇది పక్కా. అందులో ఎలాంటి డౌట్ లేదు. రాజమౌళి స్వయంగా ఎనౌన్స్ చేసాడు. కానీ మహేష్ ఎక్కడా రాజమౌళి సినిమా విషయమై [more]
రాజమౌళి తో మహేష్ సినిమా ఇది పక్కా. అందులో ఎలాంటి డౌట్ లేదు. రాజమౌళి స్వయంగా ఎనౌన్స్ చేసాడు. కానీ మహేష్ ఎక్కడా రాజమౌళి సినిమా విషయమై స్పందించడం లేదు. కానీ మహేష్ ఫాన్స్ రాజమౌళి తో సినిమా అంటే పాన్ ఇండియా లెవల్లో ఊహించుకుంటున్నారు. అయితే రాజమౌళి మాత్రం మహేష్ తో పాన్ ఇండియా ప్లాన్ లో లేడని తెలుస్తుంది. బాహుబలి తర్వాత అంతటి క్రేజ్ తో సినిమా చెయ్యాలని డిసైడ్ అయిన రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలను కలిపి RRR ప్లాన్ చేసాడు. మళ్ళీ పాన్ ఇండియా లెవల్లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తోనే RRR ప్లాన్ చేసాడు. అయితే బాహుబలికి ఐదేళ్లు వెచ్చించిన రాజమౌళి.. RRR కోసం దాదపుగా రెండున్నరేళ్లు వెచ్చిస్తున్నాడు. అందుకే నెక్స్ట్ మూవీని త్వరగా పూర్తి చెయ్యాలని.. అందులోని మళ్ళి పాన్ ఇండియా వద్దు అని రాజమౌళి ఆలోచనట.
మహేష్ కూడా రెండుమూడేళ్ల సమయం ఒక్క సినిమా కోసం వెచ్చించడానికి ఇష్టపడడం లేదట. ఇప్పటికే చాలా స్పీడుగా సినిమాలు చేస్తున్న మహేష్.. రాజమౌళి సినిమాని కూడా ఏడాదిలోగా పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడట. ఇక మహేష్ తో రాజమౌళి భారీ యాక్షన్ మూవీ ప్లాన్ చేసేకన్నా.. రాజమౌళి కూడా తనదైన స్టయిల్ లో కథని సిద్ధం చేస్తున్నాడని.. పాన్ఇండియా అంటే భారీ సెట్లు, పీరియడ్ బ్యాక్ డ్రాప్స్ కన్నా.. రాజమౌళి మార్క్ మసాలా కథతో మహేష్ సినిమా చేస్తాడని ఫిలింనగర్ లో గుసగుసలు విలనబడుతున్నాయి. మరి మహేష్ తో రాజమౌళి మూవీ పాన్ ఇండియా లెవల్లో ఊహించుకుంటున్న మహేష్ అభిమానులకు ఈ న్యూస్ కాస్త షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.