కియారా నో చెప్పింది… ఇపుడు మరో బాలీవుడ్ భామ?

మహేష్ కోసం పరశురామ్ బాలీవుడ్ భామను తప్ప వేరే ఆలోచించడం లేదు. మొదటిసారి ఓ పెద్ద సినిమా చేస్తున్న పరశురామ్ అన్నీ రిచ్ గా ఉండేలా చూసుకుంటున్నాడు. [more]

;

Update: 2020-06-08 05:04 GMT
Sai Manjrekar
  • whatsapp icon

మహేష్ కోసం పరశురామ్ బాలీవుడ్ భామను తప్ప వేరే ఆలోచించడం లేదు. మొదటిసారి ఓ పెద్ద సినిమా చేస్తున్న పరశురామ్ అన్నీ రిచ్ గా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇంక్లూడింగ్ హీరోయిన్ తో సహా. అందుకే బాలీవుడ్ లో రేజింగ్ లో ఉన్న కియారా అద్వానీని మహేష్ కోసం మరోసారి సర్కారు వారి పాట కోసం ట్రై చేసినట్లుగా.. కియారా మహేష్ ఆఫర్ ని కాదనలేక ఒప్పేసుకున్నట్లుగా… డేట్స్ విషయంలో కియారా కండిషన్స్ కి కూడా ఓకె చెప్పినట్టుగా చెప్పారు. తాజాగా సర్కారు వారి పాటలో కియారా నటించడం లేదని తెలుస్తుంది.

కియారా ఖాళీ లేదని చెబితే చెప్పింది మరో అందమైన బాలీవుడ్ భామనే తీసుకుందామని పరశురామ్ మహేష్ కి నమ్రతకి చెప్పినట్లుగా తెలుస్తుంది. అందుకే పరశురామ్ అండ్ టీం బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ ని అనుకుంటున్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు – నటుడు అయినా మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్. ఈ అమ్మాయి బాలీవుడ్ లోనే సల్మాన్ ఖాన్ సినిమా దబాంగ్-3 తోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ అమ్మాయి లుక్స్ పరంగా మహేష్ కి బాగా సూట్ అవుతుంది అని పరశురామ ను టీం భావించడం ఆమెని ఫోన్ లోనే సంప్రదించినట్లుగా తెలుస్తుంది.

Tags:    

Similar News