ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే దుమ్ముదులిపింది

2019 సంక్రాంతికి ముందుగా కర్చీఫ్ వేసుకున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడే. బాలకృష్ణ – క్రిష్ కాంబోలో రెండో సినిమాగా తెరకెక్కుతున్న ఈ ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, [more]

Update: 2019-01-01 04:06 GMT

2019 సంక్రాంతికి ముందుగా కర్చీఫ్ వేసుకున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడే. బాలకృష్ణ – క్రిష్ కాంబోలో రెండో సినిమాగా తెరకెక్కుతున్న ఈ ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు అను రెండు పార్ట్ లుగా మూడు వారాల గ్యాప్ తో విడుదల కాబోతుంది. తాజాగా జరిగిన బయోపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటుగా, ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు ట్రైలర్, సినిమా మీద బీభత్సమైన అంచనాలు పెంచేసింది.

బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పలు భాషల్లో విడుదల చేస్తున్నట్లుగా బాలకృష్ణ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే తెలియజేశాడు. ఇక రెండు తెలుగు ప్రేక్షకులతో పాటుగా ఓవర్సీస్ ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న కథానాయకుడు సినిమా బిజినెస్ వీర లెవల్లో జరిగింది. అసలే పండక్కి భారీ సినిమాలైనా వినయ విధేయరామ, పెటా, ఎఫ్ టు లాంటి సినిమాలు పోటీ పడుతున్నప్పటికీ… ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా బిజినెస్ చూస్తే మాత్రం కళ్ళు తిరగడం ఖాయం. ఇక బాలకృష్ణ కెరీర్ లోనే ఎన్టీఆర్ కథానాయకుడు కి భారీ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ గా 71 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరిగితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంకా సంక్రాతి బరిలో ఎన్టీఆర్ బయోపిక్ కి పెద్దగా పోటీ లేకపోతె 90 కోట్ల నుండి 100 కోట్ల బిజినెస్ జరిగుండేదని… పెద్ద సినిమాల పోటీ వలన బయ్యర్లు కాస్త వెనకడుగు వెయ్యడంతోనే 71 కోట్లకి బిజినెస్ జరిగిందంటున్నారు ట్రేడ్ నిపుణులు.

ఏరియా: బిజినెస్ (కోట్లలో)
నైజామ్ 13.50
సీడెడ్ 12 .00
ఉత్తరాంధ్ర అండ్ కృష్ణా 11. 40
ఈస్ట్ గోదావరి 5.40
వెస్ట్ గోదావరి 4.20
గుంటూరు 6.00
నెల్లూరు 2.50

ఏపీ అండ్ టీఎస్ మొత్తం 55.00
ఇతర ప్రాంతాలు 6.25
ఓవర్సీస్ 10.00

వరల్డ్ వైడ్ బిజినెస్ 71.25 కోట్లు

Tags:    

Similar News