ప్రియా ప్రకాష్ తో మళ్లీ చేయను

మలయాళంలో ఒరు ఆడార్ లవ్ సినిమా రోషన్ – నూరిన్ – ప్రియా ప్రకాష్ జంటగా తెరకెక్కింది. ఈ సినిమా తెరకెక్కించినప్పుడు దర్శకుడు ఎక్కువగా రోషన్ – [more]

Update: 2019-02-22 07:29 GMT

మలయాళంలో ఒరు ఆడార్ లవ్ సినిమా రోషన్ – నూరిన్ – ప్రియా ప్రకాష్ జంటగా తెరకెక్కింది. ఈ సినిమా తెరకెక్కించినప్పుడు దర్శకుడు ఎక్కువగా రోషన్ – నూరిన్ నే హైలెట్ చేస్తూ ప్రియా ప్రకాష్ ని సైడ్ క్యారెక్టర్ గానే ఉంచేసాడు. కానీ ప్రియా ప్రకాష్ కేవలం కన్ను గీటి, వేళ్లతో గన్ చేసి పేలుస్తూ.. ఒక్కసారిగా ఇండియా వైడ్ గా సెలబ్రిటీ అవడంతో.. ఒరు ఆడార్ లవ్ దర్శకుడు ప్రియాకి ఉన్న క్రేజ్ తో సినిమా కథను మళ్లీ మార్చేసి.. సినిమాలో ప్రియా ప్రకాష్ ని మెయిన్ లీడ్ చేసేసాడు. అది ఒరు ఆడార్ లవ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యింది. అయితే సినిమా విడుదలయ్యాక సినిమాలో సైడ్ రోల్ ప్రియా ప్రకాష్ దని.. అసలు కీలకపాత్ర నూరిన్ దే అని చాలామంది అన్నారు.

ప్రియా వల్లే ఇలా జరిగింది

తాజాగా నూరిన్ కూడా అదే చెబుతుంది. ఒరు ఆడార్ లవ్ తెలుగులో లవర్స్ డే సినిమాగా విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమా గురించి ఆల్మోస్ట్ మరిచిపోతున్న తరుణంలో ఆ సినిమాలో నటించిన నూరిన్… అసలు ఒరు ఆడార్ లవ్ సినిమా మొదలైనప్పుడు తననే హీరోయిన్ గా తీసుకున్నారని… కానీ ప్రియా ప్రకాష్ ఒక్కసారిగా పాపులర్ అవడంతో.. తన పాత్ర కుదించేసి.. ప్రియా ప్రకాష్ పాత్రని హైలెట్ చేసారని… కేవలం ప్రియా వలనే హీరోయిన్ గా ఉండాల్సిన తన పాత్ర చివరికి సపోర్టింగ్ రోల్ గా ఉండిపోయిదని ఆవేదన వ్యక్తం చేస్తుంది నూరిన్.

మళ్లీ ఆమెతో నటించను

అయితే ఆ విషయంలో బాధపడుతున్న నూరిన్ ఈసారి ప్రియా ప్రకాష్ తో కలిసి నటించే అవకాశమొస్తే వీలున్నంత వరకు ఒప్పుకోనని తెగేసి చెబుతుంది. పాపం ఎంత కడుపు మండిందో కదా. అలాగే హీరో రోషన్ తో అవకాశమొస్తే మాత్రం వదులుకోలేనని కూడా చెబుతుంది నూరిన్. మరి నిజంగానే ఒరు ఆడార్ లవ్ దర్శకుడు ప్రియా కొచ్చిన క్రేజ్ తోనే సినిమా ఆడేస్తుందని.. చెత్త సినిమాని తీసి ప్రేక్షకుల మీదకి వదిలాడు. మరి ప్రేక్షకులు తెలివ తక్కువోల్లేం కాదుగా.. అందుకే తిప్పికొట్టారు.

Tags:    

Similar News