ఏ ప్రాతిపదికన ఉత్తమ చిత్రాలు ఎంపిక చేస్తున్నారు ? యువతకు వారిచ్చే సందేశం ఏమిటి ?
మన దేశంలో ప్రతిష్టాత్మకంగా భావించే సినిమా అవార్డులు ‘ జాతీయ చలనచిత్ర పురస్కారాలు’. ప్రతి ఏడాది సామాజిక అంశాలతో రూపొందించే చిత్ర విజేతలకు ఆ పురస్కారాలను రాష్ట్రపతి అందిస్తారు.
ఏ ప్రాతిపదికన ఉత్తమ చిత్రాలు ఎంపిక చేస్తున్నారు ?
యువతకు వారిచ్చే సందేశం ఏమిటి ?
మన దేశంలో ప్రతిష్టాత్మకంగా భావించే సినిమా అవార్డులు ‘ జాతీయ చలనచిత్ర పురస్కారాలు’. ప్రతి ఏడాది సామాజిక అంశాలతో రూపొందించే చిత్ర విజేతలకు ఆ పురస్కారాలను రాష్ట్రపతి అందిస్తారు. దీంతో ఆయా చిత్రాలు, నటీనటులకు, దర్శకులు ప్రజాభిమానానికి పాత్రులవుతారు.
అయితే ప్రస్తుతం వాటి ఎంపిక విధానం ప్రశ్నార్థకంగా మారుతోంది. జ్యూరీ ఎంపిక ముందు ఎలాంటి చిత్రాలను ఎంపిక చేస్తే ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ వెళుతుందో ఆలోచించాలని ప్రేక్షకులు కోరుతున్నారు. డాన్ సినిమాలు, యాంటీ సోషల్, ప్రక్రుతి వనరులను దోచే కథాంశాలు, దేశంలో మత కలహాలను రెచ్చగొట్టే సినిమాలకు అవార్డులు ప్రకటించడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ తన డాన్సులు, యాక్షన్తో, టైమింగ్ కామెడీతో ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే పుష్ప సినిమాలో తన పాత్ర ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే పాత్ర. ఆ పాత్రకు ఉత్తమనటుడిగా అవార్డు ఇవ్వడం అంటే ఉత్తమ చిత్రాల ఎంపిక ఏ ప్రాతిపదికన చేస్తున్నట్లు ? ప్రజలకు, మరీ ముఖ్యంగా యువతకు ఈ జ్యూరీ సభ్యులు ఏం సందేశం ఇస్తున్నట్లు అని ప్రజలు,సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.
‘కాశ్మీరీ ఫైల్స్’ ఆసినిమాలో కాశ్మీరీ పండిట్లను ఎలా వెళ్లగొట్టారు ? వారి బాధలు గురించి ముస్లింలపై విద్వేశాలను రెచ్చగొట్టే విధంగా ఉన్న తప్పుడు కథనాలతో రూపొందించారని ఆ సినిమా అనేక విమర్శలను ఎదుర్కొంది... ‘దానికి జాతీయ సమగ్రత’ అవార్డు ప్రకటించడంపై సమాజిక వేత్తలు మండిపడుతున్నారు. మతకలహాలు రేగడానికి ముఖ్యకారణం ప్రభుత్వ విధానాలు, వాటిని సరిచేసి భారత జాతిని ఏకతాటిపై నిలపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాశ్మీరీఫైల్స్, కేరళఫైల్స్ సినిమాలు రూపొందించి ప్రజల్లో భయాందోళనలు కలిగించడం ఎంతవరకు సమంజసం ?
అనేక ఏళ్లుగా బాధలు అనుభవిస్తున్న కాశ్మీర్ శరణార్థి శిబిరాల్లోని పండిట్లకు బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్లలో ఏం సాయం చేసిందని సోషల్ యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారు.
అణగారిన వర్గాలపై జరుగుతున్న పోలీస్ హింస, వారికి అందని సామాజికన్యాయంపై రూపొందించిన ‘జై భీమ్‘ చిత్రానికి అవార్డు ప్రకటించకపోవడం ప్రభుత్వానికి వారి సమస్యలపై చిత్తశుద్ది లేదని తెలియచేస్తోందని సామాజికవేత్తలు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు.
ఎవడిగోల వాడిది
ఇదిలా ఉండగా, బన్నీకి కాకుండా తనకు అవార్డు ప్రకటిస్తే బాగుండేదని బాలీవుడ్ యాక్టర్ (కాశ్మీర్ ఫైల్స్)అనుపమ్ ఖేర్ వాపోతున్నారట.