మళ్లీ మార్చిన వాల్తేరు వీరయ్య వేదిక
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల వేదికను నిర్వాహకులు మళ్లీ మార్చారు;
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల వేదికను నిర్వాహకులు మళ్లీ మార్చారు. విశాఖలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయతే తొలుత ఆర్కే బీచ్ అనుకున్నారు. అయితే పోలీసులు నిరాకరించడంతో దానిని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ కు మార్చారు.
ఏయూ గ్రౌండ్స్ నుంచి...
కానీ ఏం జరిగిందో తెలియదు కాని ఉన్నట్లుండి మళ్లీ వేదికను మార్చారు. తిరిగి ఆర్కే బీచ్ లోనే నిర్వాహకులు వేడుకను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రేపు వాల్తేరు వీరయ్య వేడుకలను నిర్వహించడానికి తిరిగి సన్నాహాలు ప్రారంభించారు. పోలీసులు అనుమతితోనే నిర్వాహకులు వేదికను మార్చినట్లు తెలుస్తోంది.