470 కేజీల వెండి పవన్ కళ్యాణ్‌ని చూశారా..?

సినిమా హీరోల అభిమానులందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేరయా.. అని ఊరుకునే అన్నారు. ఎందుకంటే పవన్ పై వాళ్ళు చూపే అభిమానం;

Update: 2023-09-01 03:30 GMT
Pawan Kalyan, Pawan Kalyan Silver Art, OG Movie, Pavan Kalyan fans
  • whatsapp icon

సినిమా హీరోల అభిమానులందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేరయా.. అని ఊరుకునే అన్నారు. ఎందుకంటే పవన్ పై వాళ్ళు చూపే అభిమానం ఎవరు ఉహించని విధంగా ఉంటుంది. తమ అభిమానంతో పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా పవన్ పుట్టినరోజు వస్తున్న సందర్భంగా కొందరు ఫ్యాన్స్ చేసిన పని ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటుంది.

దాదాపు 470 కేజీల వెండి ఆభరణాలతో పవన్ కళ్యాణ్ రూపం వచ్చేలా నెల పై అమర్చి అదరహో అనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోని జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ చేత రిలీజ్ చేయించారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన కొంతమంది నెటిజెన్స్ ఆ 470 కేజీల వెండి రేటుని చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ధర బట్టి ఆ మొత్తం వెండి వాల్యూ సుమారు 3 కోట్ల 71 లక్షల 30 వేలు ఉంటుంది అంటూ చెబుతున్నారు. మరి ఆ వెండి ఆర్ట్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.
కాగా ఈ బర్త్ డే కానుకగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG మూవీ నుంచి అప్డేట్ రాబోతుంది. ఫస్ట్ లుక్ ఏమి లేకుండా డైరెక్ట్ టీజర్ తో అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 2న ఉదయం 10:35 నిమిషాలకు ఈ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. టాలీవుడ్ హిస్టరీలోనే ఈ టీజర్ బెస్ట్ గా ఉండబోతుంది అంటూ సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాటలు.
సాహూ ఫేమ్ సుజిత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం 90's బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పటికే మూవీ షూటింగ్ 80 శాతం పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది. ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్ తో రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.


Tags:    

Similar News