బరువు తగ్గిన పవన్: లుక్ వైరల్

సినిమాల నుండి అర్ధాంతరంగా రాజకీయాల్లోకి వెళ్ళాక పవన్ కళ్యాణ్ ఫిట్ నెస్ ని పూర్తిగా పక్కనపెట్టేశారు. రాజకీయాలతో బిజీగా ఉంటున్న టైం లోనే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి [more]

;

Update: 2021-07-09 15:38 GMT

సినిమాల నుండి అర్ధాంతరంగా రాజకీయాల్లోకి వెళ్ళాక పవన్ కళ్యాణ్ ఫిట్ నెస్ ని పూర్తిగా పక్కనపెట్టేశారు. రాజకీయాలతో బిజీగా ఉంటున్న టైం లోనే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్ కి పవన్ కళ్యాణ్ ఏ లుక్ లో ఉన్నా, ఎంత లావుగా ఉన్నా పెద్దగా తేడా లేకపోయింది. కానీ క్రిష్ హరిహర వీరమల్లు, ఏకే రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ కాస్త స్లిమ్ అవ్వాల్సి ఉన్నా.. అదే బరువుతో పవన్ కళ్యాణ్ రెండు సినిమాల్లో నటించేస్తున్నారు. పవన్ కోసం స్పెషల్ గా బెంగుళూరు నుండి ఓ జిమ్ ట్రైనర్ కూడా రాబోతున్నట్టుగా ప్రచారం జరిగింది.
అయినప్పటికి పవన్ లుక్ లో కానీ, పవన్ బరువులో కానీ ఎలాంటి మార్పు లేదు. కానీ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడి, లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడ్డారు. దాదాపుగా నెలరోజుల రెస్ట్ లో ఉన్న పవన్ కళ్యాణ్ లాక్ డౌన్ ముగిసి అన్ని సర్దుకున్నాక అటు సినిమా షూటింగ్స్, ఇటు పొలిటికల్ మీటింగ్స్ కోసం బయటికి వచ్చారు. నేడు పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీస్ కి వెళ్ళడానికి.. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగారు. ఎయిర్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ న్యూ లోక్ లో కనిపిస్తున్నారు. కాస్త సన్నబడినట్లుగా, అలాగే కొద్దిగా స్టయిల్ కూడా మార్చినట్లుగా అనిపిస్తుంది. స్టయిల్ సంగతి ఎలా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త స్లిమ్ గా మారిపోయారనేది.. ఆయన లేటెస్ట్ క్లిక్స్ తో తెలిసిపోతుంది.

Tags:    

Similar News