నిధితో పవన్ రొమాన్స్?

పవన్ కళ్యాణ్ వరస సినిమాల్తో బిజీ. సినిమాల మధ్యలో రాజకీయాలు. అంతేకాకుండా అన్న కూతురు పెళ్లి. అయినా పవన్ సినిమాల కమిట్మెంట్స్ మాములుగా లేవు. పవన్ రీ [more]

;

Update: 2020-11-23 07:51 GMT
Nidhi Agarwal
  • whatsapp icon

పవన్ కళ్యాణ్ వరస సినిమాల్తో బిజీ. సినిమాల మధ్యలో రాజకీయాలు. అంతేకాకుండా అన్న కూతురు పెళ్లి. అయినా పవన్ సినిమాల కమిట్మెంట్స్ మాములుగా లేవు. పవన్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ షూటింగ్ ఎప్పుడు అవుతుందో అనేది దర్శకనిర్మాతలకు క్లారిటీ ఉన్నట్టుగా లేదు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి మద్దతు పలికింది. అంటే మరో వారం పాటు ఈ ఎన్నికల హడావిడిలో పవన్ ఉండడం, తర్వాత నిహారిక పెళ్ళికి రాజస్థాన్ వెళ్లొచ్చాక, వకీల్ సాబ్ షూటింగ్ కూడా ఫినిష అయ్యాక పవన్, క్రిష్ సినిమా కోసం రెడీ అవుతాడు.

మరి పవన్ కళ్యాణ్ సెట్స్ మీదకొచ్చేలోపు క్రిష్ కూడా పవన్ కోసం హీరోయిన్ ని ఫైనల్ చెయ్యాలి. ముందు నుండి క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అనే టాక్ వుంది. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబో మూవీ కోసం ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్ ని చిత్ర బృందం సంప్రదించినట్టుగా.. పవన్ సరసన అవకాశం అనగానే నిధి మరు మాట్లాడకుండా క్రిష్ కి ఓకె చెప్పినట్టుగా ప్రచారం షురూ అయ్యింది. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో నిధి హీరోయిన్ గా దాదాపుగా ఫిక్స్ అంటున్నారు. ఇక పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న పవన్ – క్రిష్ సినిమా డిసెంబర్ రెండో వారం నుండి సెట్స్ మీదకెళుతుందని.. ఈలోపు నిధి ఫోటో షూట్ చేసి పవన్ పక్కన నిధి సరిపోతుందో లేదో చూసుకుంటారని తెలుస్తుంది.

Tags:    

Similar News