ఆయనో స్టార్ నిర్మాత.. కానీ వైద్యానికి డబ్బుల్లేవు : సాయం చేసిన సూర్య

తమిళ నిర్మాత అయిన దురై.. తొలుత ఏఎం రత్ననాథ్‌తో కలిసి ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌ లో పనిచేశారు. ఆ తర్వాత సొంతంగా ఎవర్ గ్రీన్;

Update: 2023-03-07 04:39 GMT
suriya helps to VA Durai

suriya helps to VA Durai

  • whatsapp icon

ఆయనో స్టార్ నిర్మాత. ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు నిర్మించి సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ.. వైద్యానికి చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్యరాజ్ వంటి వారితో సినిమాలు నిర్మించిన నిర్మాత వీఏ దురై. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై వైద్యానికి డబ్బుల్లేని పరిస్థితి. దురై గురించి తెలిసిన వెంటనే హీరో సూర్య రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దాంతో ఇతర నటీనటులు, చిత్రపరిశ్రమకు చెందినవారు కూడా దురైకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.

తమిళ నిర్మాత అయిన దురై.. తొలుత ఏఎం రత్ననాథ్‌తో కలిసి ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌ లో పనిచేశారు. ఆ తర్వాత సొంతంగా ఎవర్ గ్రీన్ ఇంటర్నేషనల్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు సినిమాలు తీశారు. ఆయన తీసిన చివరి సినిమా గజేంద్ర. దాని కంటే ముందు.. పితామగన్, లవ్‌లీ, లూటీ వంటి చిత్రాలను నిర్మించారు. బాల దర్శకత్వంలో తెరకెక్కిన పితామగన్ సినిమాలో సూర్య, విక్రమ్ కలిసి నటించారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇంత సక్సెస్ ఉన్న దురైకి ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేదని, ప్రస్తుతం మధుమేహం (షుగర్) తో బాధపడుతున్న ఆయనకు చికిత్స చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని ఆయన స్నేహితుడు ఒకరు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.
దురై శస్త్రచికిత్స కోసం డబ్బు అవసరమని, దాతలు ఆర్థిక సహాయం చేయాలని ఆ వీడియోలో కోరడంతో.. సూర్య, వెట్రిమారన్ లు తమవంతు చేయూతను అందించారు. కాగా.. 2003లో పితామగన్ డైరెక్టర్ బాల కు దురై తర్వాతి సినిమా కోసమై రూ.25 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. అప్పట్లో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆయన ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో.. ఆ డబ్బు తిరిగివ్వాలని గతేడాది దురై.. బాలను అడగ్గా.. ఆయన అందుకు నిరాకరించాడు.


Tags:    

Similar News