Singer Chinmayee:సింగర్ చిన్మయిపై పోలీసులకు ఫిర్యాదు
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్య్వూలో మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్
Singer Chinmayee:సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్య్వూలో మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా.. ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి.. అంటూ చెప్పారు అన్నపూర్ణ. ఎవరూ మనల్ని ఏమీ అనొద్దు అనుకున్నా.. అందరూ మనల్ని ఏదో ఒకటి అనేట్లుగానే రెడీ అవుతున్నామన్నారు. ఎప్పుడూ ఎదుటివాళ్లదే తప్పు అనకూడదు.. మనవైపు కూడా కొంచెం ఉంటుందని వ్యాఖ్యలు చేశారు అన్నపూర్ణ.
ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయితో పాటు పలువురు విమర్శలు గుప్పించారు. అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ వీడియోను రిలీజ్ చేశారు. తనకు నచ్చిన ఒక నటి ఇలా మాట్లాడడం ఏ మాత్రం బాగాలేదని అన్నారు. ఆమె చెప్పినట్లుగా ఉంటే అర్ధరాత్రి ఎలాంటి హాస్పిటల్స్, డాక్టర్స్ ఉండరని, వాళ్ళందరూ అమ్మాయిలు కాబట్టి అర్ధరాత్రి ఇంట్లోనే ఉంటారని అన్నారు. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, యాక్సిడెంట్ అయినా సూర్యోదయం, సూర్యాస్తమయానికి మధ్యలోనే జరగాలని, అర్ధరాత్రి జరిగితే అమ్మాయిలను ఇంట్లోనే ఉంచాలని చిన్మయి చెప్పుకొచ్చింది. ఇంట్లో వాష్‌రూమ్స్ లేక సూర్యోదయానికి ముందు పొద్దున్నే 3 గంటలకు లేచి పొలం గట్టుకు వెళ్తున్న ఆడవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారని, అమ్మాయిల వేషధారణ వలనే అత్యాచారాలు జరుగుతున్నాయని అనుకునే ఇలాంటివారు బతుకుతున్న ఇండియాలో ఆడపిల్లలుగా పుట్టడం మన కర్మ అని అన్నారు. అయితే చిన్మయి వ్యాఖ్యలపై గచ్చిబౌలి పోలీసులకు ఓ విద్యార్థి ఫిర్యాదు చేశారు. దీంతో చిన్మయి శ్రీపాదపై కేసు నమోదు చేశారు.