వీరయ్యకు వాల్తేరు పోలీసుల షాక్

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆర్కే బీచ్ లో జరపడానికి వీలులేదని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు;

Update: 2023-01-07 12:41 GMT

valtheru veerayya

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆర్కే బీచ్ లో జరపడానికి వీలులేదని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. తొలుత ఆర్కే బీచ్ లో రేపు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని నిర్ణయించారు. అయితే అందుకు పోలీసులు అనుమతించకుండా, ఏయూ గ్రౌండ్స్ లో పెట్టుకోవాలని సూచించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్దయెత్తున మెగా అభిమానులు హాజరయ్యే అవకాశాలున్నాయి.

ఏయూ గ్రౌండ్ లో...
ఏయూ గ్రౌండ్ లో ఏర్పాటు చేయకుండానే ఈరోజు ఉదయం నుంచి ఆర్కే బీచ్ లో నిర్వాహకులు సన్నాహాలు పూర్తి చేసుకుంటున్నారు. అరవై శాతం పనులు పూర్తయ్యాయి. కానీ కొద్దిసేపటి క్రితం ఆర్కే బీచ్ లో ఈవెంట్ ను అంగీకరించేది లేదని పోలీస్ కమిషనర్ చెప్పారు. అసలు ఎందుకు ఏయూ గ్రౌండ్స్ నుంచి తిరిగి ఆర్కే బీచ్ ను నిర్వాహకులు ఎంపిక చేసుకున్నారు? ఎందుకు అనుమతి లేకుండా ఆర్కే బీచ్ లో పనులు చేపట్టారన్నది తెలియాల్సి ఉంది. దీంతో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరుగుతుందా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది.


Tags:    

Similar News