ఇండస్ట్రీలో మరో విషాదం.. లేడీ కమెడియన్ హఠాన్మరణం

జెపి నగర్ లోని ఆమె నివాసంలో ఉండగా.. ఉన్నట్లుండి ఛాతీలో నొప్పిరావడంతో వెంటనే స్నేహితులకు ఫోన్ చేశారు. ఆమె స్నేహితులు..;

Update: 2022-02-23 05:16 GMT
ఇండస్ట్రీలో మరో విషాదం.. లేడీ కమెడియన్ హఠాన్మరణం
  • whatsapp icon

బెంగళూరు : కన్నడ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే పలువురు కన్నడ నటులు అనారోగ్య సమస్యలతో మరణించగా.. మరో లేడీ కమెడియన్, యాంకర్ హఠాన్మరణం చెందారు. కన్నడ రేడియో జాకీగా.. శ్రోతలను తన గొంతుతో మంత్రముగ్ధుల్ని చేసిన ఆర్ జే రచన మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. 39 సంవత్సరాల అతి చిన్నవయసులోనే రచన గుండెపోటుతో మరణించడం ఆమె అభిమానులను తీవ్రంగా కలచివేసింది.

Also Read : మళ్లీ పెరిగిన బంగారం ధర.. పసిడి ప్రియులకు షాక్
జెపి నగర్ లోని ఆమె నివాసంలో ఉండగా.. ఉన్నట్లుండి ఛాతీలో నొప్పిరావడంతో వెంటనే స్నేహితులకు ఫోన్ చేశారు. ఆమె స్నేహితులు రచనను దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్చగా.. అప్పటికే ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. రచన బెంగళూరులో రేడియో జాకీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్నుంచి రచన కాస్తా.. ఆర్ జే రచనగా మారింది. ఆ తర్వాత నటనలోనూ తన టాలెంట్ ను చూపించింది. లేడీ కమెడియన్ గా.. తన స్టైల్ లో హాస్యాన్ని పండిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆర్ జె రచన హఠాన్మరణం పట్ల పలువురు కన్నడ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.


Tags:    

Similar News