ప్రభాస్ ప్లాన్ వేరయా?

ప్రభాస్ కెరీర్ బాహుబలికి ముందు, బాహుబలికి వెనక అని మాట్లాడుకుంటే.. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా లెవల్ ని మెయింటింగ్ చేస్తున్నాడు. బాహుబలి తర్వాత సాహో లాంటి [more]

;

Update: 2021-03-04 07:48 GMT
Prabhas
  • whatsapp icon

ప్రభాస్ కెరీర్ బాహుబలికి ముందు, బాహుబలికి వెనక అని మాట్లాడుకుంటే.. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా లెవల్ ని మెయింటింగ్ చేస్తున్నాడు. బాహుబలి తర్వాత సాహో లాంటి భారీ ప్రాజెక్ట్ చేసాడు. సాహో తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా లిస్ట్ తెలిసిందే. రాధేశ్యామ్ షూటింగ్ ఫినిష్ అయ్యి.. జులై 30 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ప్రభాస్ అటు సలార్ షూటింగ్, ఇటు ఆదిపురుష్ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు. ప్రస్తుతం సలార్ షెడ్యూల్ ఒకటి పూర్తి చేసి ఆదిపురుష్ కోసం ముంబై లో మకాం పెట్టాడు. ప్రభాస్ ఇప్పుడు హైదరాబాద్ – ముంబై అంటూ తిరగక్కర్లేదు. అన్నీ పాన్ ఇండియా మూవీస్ కాబట్టి ఎక్కువగా ముంబైలోనే ఉండాలి. అందుకే ముంబైలో ఓ ప్లాట్ కోనేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లుగా సోషల్ మీడియా టాక్.

కేవలం ప్రభాస్ ఫోకస్ సినిమాల మీదే లేదు. బిజినెస్ విషయంలోనూ ప్రభాస్ పావులు కదుపుతున్నట్టుగా లేటెస్ట్ టాక్ ఉంది. ప్రభాస్ ముంబై వేదికగా వ్యాపారం మొదలు పెట్టె యోచనలో ఉన్నాడట. అందుకే ఏకంగా ముంబైకి మకాం మార్చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ముంబైలోనే ఎక్కువగా గడుపుతున్న ప్రభాస్ హోటల్ రూమ్స్ కి కోట్లు ఖర్చుపెట్టడం ఎందుకు అని.. ముంబై లోని ఖరీదైన ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చెయ్యడానికి రెడీ అయ్యాడట. ప్రస్తుతం ప్రభాస్ టీమ్ ముంబై లో ప్రభాస్ కోసం ఖరీదైన ప్లాట్ వేటలో ఉందట. ఆదిపురుష్ తర్వాత నాగ్ అశ్విన్ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రభాస్ ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

Tags:    

Similar News