పేపర్ బాయ్ చిత్రం ట్రైలర్ కు తన ప్రశంసలు అందచేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ట్రైలర్ చూసిన తర్వాత కాసేపు చిత్ర యూనిట్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్, పాటల్లో మంచి విజువల్స్ కనిపిస్తున్నాయి. శోభన్ నా కెరీర్ కు వర్షం సినిమాతో తొలి విజయాన్ని అందించారు.. అదే విధంగా ఇప్పుడు సంతోష్ కూడా విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. నా బిల్లా సినిమాకు పని చేసిన సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్ర హక్కుల్ని కొనడం మరో మంచి పరిణామం’’ అని తెలిపారు. ప్రభాస్ వచ్చి తమ చిత్రానికి విషెస్ తెలపడంతో పేపర్ బాయ్ చిత్ర యూనిట్ ఆనందంలో తేలిపోతోంది. ఆగస్టు 31న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
నటీనటులు:
సంతోశ్ శోభన్, రియాసుమన్, తాన్యాహోప్, పోసాని కృష్ణమురళి, అభిషేక్ మహర్షి, విద్యురామన్, జయప్రకాశ్ రెడ్డి, బిత్తిరి సత్తి, సన్నీ, మహేశ్ విట్టా తదితరులు.