సాహోలో ఆ యాంగిల్ కూడా ఉందట..!

ప్రభాస్ – సుజిత్ కాంబోలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సాహో చిత్రం షూటింగ్ చిన్న చిన్న గ్యాప్స్ తో కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా [more]

Update: 2019-01-05 08:23 GMT

ప్రభాస్ – సుజిత్ కాంబోలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సాహో చిత్రం షూటింగ్ చిన్న చిన్న గ్యాప్స్ తో కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా ఇండియా వైడ్ గా పలు భాషల్లో ఆగష్టు 15 న విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది సాహో చిత్రం. ప్రభాస్ ఇంటర్నేషనల్ దొంగ గా ఈ సినిమాలో కనిపిస్తాడని… అలాగే బాలీవుడ్ నుండి విలన్స్, హీరోయిన్స్ ని దింపిన దర్శక నిర్మాతలు.. ఈ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారని… సినిమా మొదలెట్టినప్పటి నుండి ప్రచారం జరుగుతుంది. అలాగే షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్ వీడియో చూసిన దగ్గర నుండి ఇది పక్కా యాక్షన్ ఫిలిం అని అందరూ ఫిక్స్ అయ్యారు కూడా.

కావాల్సినంత కామెడీ కూడా..

తాజాగా సాహోలో కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. కావాల్సినంత కామెడీ కూడా ఉంటుందని చెబుతున్నారు. కథకు తగ్గట్టుగా… కామెడీని సుజిత్ ఈ సినిమాలో అప్లై చేసాడట. మరి సుజిత్ గత చిత్రం రన్ రాజా రన్ లో కావాల్సినంత కామెడీని చూపించాడు. శర్వానంద్ తోనే కామెడీ చేయిస్తూ ఆ సినిమాతో హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాన్ని యాక్షన్ కామెడీని కలగలిపి మరీ ప్రేక్షకులకు అందిచబోతున్నాడని అంటున్నారు. మరి ఆ లెక్కన సాహో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే రూపు దిద్దుకుంటున్నమాట. మరి ప్రభాస్ యాక్షన్ అండ్ కామెడీ చూడాలి అంటే ఆగష్టు 15 వరకు వెయిట్ చెయ్యాల్సిందే. ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ విలన్ గా నటిస్తున్నారు.

Tags:    

Similar News