సాహో గురించి ఎవరు మాట్లాడరేం?

బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ చేస్తున్న చిత్రం సాహో. చిన్న మూవీగా స్టార్ట్ అయ్యి బాలీవుడ్‌ అప్పీల్‌ కోసమని బడ్జెట్‌ భారీగా పెంచేశారు. అలానే బాలీవుడ్ వాళ్ళ [more]

Update: 2019-06-01 05:52 GMT

బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ చేస్తున్న చిత్రం సాహో. చిన్న మూవీగా స్టార్ట్ అయ్యి బాలీవుడ్‌ అప్పీల్‌ కోసమని బడ్జెట్‌ భారీగా పెంచేశారు. అలానే బాలీవుడ్ వాళ్ళ కోసం అక్కడ యాక్టర్స్ ని తెచ్చుకున్నారు. సంగీతం దర్శకులని కూడా అక్కడ నుండే ఇంపోర్ట్ చేసుకున్నారు. బాలీవుడ్‌ త్రయం ‘శంకర్‌, ఎహ్‌సాన్‌, లాయ్‌’కి సంగీతం బాధ్యతలు అప్పగించారు. మరో రెండు నెలల్లో రిలీజ్ కానుంది అనగా వారి మ్యూజిక్‌ తెలుగువారి అభిరుచికి తగ్గట్టు లేదని రియలైజ్‌ అయి వారిని తొలగించారు.

వారి ప్లేస్ లో తమన్ అండ్ గిబ్రాన్ వచ్చారు. వీరు బాలీవుడ్ వారిని ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి. ఇంతవరకు ఈమూవీకి సరైన ప్రమోషన్స్ చేయలేదు. ఎటువంటి బజ్ కూడా కనిపించడంలేదు. ప్రభాస్ కాబట్టి తెలుగులో ఎలా అయినా క్రేజ్ ఉంటుంది. కానీ బాలీవుడ్ లో భారీ ప్రమోషన్స్ చేస్తే తప్ప ఈసినిమాను చూసే అవకాశం లేదు. ట్రైలర్స్, సాంగ్స్ రిలీజ్ అయితే కొంచం అయినా బజ్ వచ్చేఅవకాశం ఉందని ఆశిస్తున్నారు. ఆలస్యం అమృతం విషయం అంటే ఇదే. లేట్ చేసే కొద్దీ సినిమాపై అంచనాలు తగ్గిపోతుంటాయి.

Tags:    

Similar News