నిన్నటి నుండి సాహో రంగు బయటపడింది

ప్రభాస్ సాహో క్రేజ్ కేవలం మొన్న సోమవారం వరకే పని చేసింది. నాలుగు రోజులో కలెక్షన్స్ జోరు చూపించిన సాహో నిన్న మంగళవారం భారీగా డ్రాప్ అయ్యింది. [more]

Update: 2019-09-04 07:22 GMT

ప్రభాస్ సాహో క్రేజ్ కేవలం మొన్న సోమవారం వరకే పని చేసింది. నాలుగు రోజులో కలెక్షన్స్ జోరు చూపించిన సాహో నిన్న మంగళవారం భారీగా డ్రాప్ అయ్యింది. నెగెటివ్ టాక్ తోనే నాలుగు రోజుల్లో కలెక్షన్స్ సునామి సృష్టించిన సాహో… నిన్న వీక్ డే మొదలవడంతో.. దాని అసలు రంగు బయటపడింది. ప్లాప్ టాక్ తో సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవడం అనేది ఎక్కడో ఓ సినిమాకి మాత్రమే వర్క్ అవుట్ అవుతుంది. 50 కోట్లతో గనక సాహో తీసినట్లైతే.. ఈ ప్లాప్ టాక్ తోనే 150 కోట్ల లాభాలు తెచ్చేది. కానీ 330 కోట్లతో తెరకెక్కడంతో.. సాహో కి ఇప్పుడు 100 కోట్ల లాస్ తప్పేలా లేదు.

ఏరియా: షేర్ (కోట్లలో )
నైజాం 24.80
సీడెడ్ 10.18
నెల్లూరు 3.72
కృష్ణ 4.64
గుంటూరు 7.26
వైజాగ్ 7.90
ఈస్ట్ గోదావరి 6.56
వెస్ట్ గోదావరి 5.07

టోటల్ ఏపీ & టీస్ షేర్: 70.13

కర్ణాటక 7.10
ఇతర ప్రాంతాలు 16.72
ఓవర్సీస్ 18.27

టోటల్ వరల్డ్ వైడ్ షేర్: 112.22

Tags:    

Similar News