ఎన్టీఆర్ ని కలిసిన కన్నడ దర్శకుడు?

ఎన్టీఆర్ RRR తర్వాత త్రివిక్రమ్ తో ఆతర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమాలు కమిట్ అయ్యాడు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కథ ఎప్పుడో ఓకె [more]

;

Update: 2020-08-12 04:46 GMT

ఎన్టీఆర్ RRR తర్వాత త్రివిక్రమ్ తో ఆతర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమాలు కమిట్ అయ్యాడు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కథ ఎప్పుడో ఓకె అయ్యింది. కానీ ప్రశాంత్ నీల్ ది ఆలా కాదు.. కెజిఎఫ్ సినిమా చూసి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేద్దామని చెప్పడం, మైత్రి మూవీస్ వారు వీరి కాంబో మూవీని పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్న అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో పై సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు ప్రచారంలోకొచ్చాయి. ఇక తాజాగా ప్రశాంత్ నీల్ ఫోన్ లో ఎన్టీఆర్ కి కథ వినిపించాడని న్యూస్ నడుస్తుంది.

ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ తాజాగా ఎన్టీఆర్ ని హైదెరాబాదులో కలిసినట్టుగా వార్తలొస్తున్నాయి. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 యొక్క విజువల్ ఎఫెక్ట్స్ పనిని చూసేందుకు హైదరాబాద్ లో అడుగుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని మీట్ అయినట్లుగా… అందులో భాగంగా కథ చెప్పినట్టుగా తెలుస్తుంది. వారి కాంబో సినిమాపై ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలిసి చర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కథని ఓకె చేసాడని మాత్రం సమాచారం లేదు. మరి ప్రశాంత్ నీల్ కథ ఒకే అయ్యాకే ఈ కాంబోపై అధికారిక ప్రకటన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News