ప్రధాని మోదీ సంతాపం
ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని ప్రకటించారు.;
ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని ప్రకటించారు. కృష్ణంరాజు మరణం తనను కలచి వేసిందన్నారు. రాబోయే తరాలు కృష్ణంరాజు నటనా కౌశల్యాన్ని, సృజనాత్మకతను స్మరించుకుంటూ ఉంటాయని మోదీ అన్నారు.
సమాజ సేవలోనూ...
సమాజ సేవలోనూ కృష్ణంరాజు ముందంజలో ఉండి రాజకీయ నాయకుడిగా తనదైన ముద్రను వేసుకున్నారని మోదీ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నానని ప్రకటించారు. కృష్ణంరాజు తనతో కలసిన ఫొటోను ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు.