ఈ ఛాన్స్ కూడా రాలేదా..?

గత ఏడాది విజయ్ దేవరకొండ సరసన లక్కీ ఛాన్స్ కొట్టేసిన అనంతపురం అమ్మాయి ప్రియాంక జవాల్కర్ కి టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరుస్తుందని అనుకున్నారు. ఆమె విజయ్ [more]

;

Update: 2019-03-26 06:57 GMT
priyanka lost chance in akhil movie
  • whatsapp icon

గత ఏడాది విజయ్ దేవరకొండ సరసన లక్కీ ఛాన్స్ కొట్టేసిన అనంతపురం అమ్మాయి ప్రియాంక జవాల్కర్ కి టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరుస్తుందని అనుకున్నారు. ఆమె విజయ్ సరసన నటించిన టాక్సీవాలా ఓ అన్నంత బ్లాక్ బస్టర్ కాకపోయినా నిర్మాత బాగానే వెనకేసుకున్నాడు. ఆ సినిమాలో డాక్టర్ పిల్లగా విజయ్ తో రొమాన్స్ చేసిన ప్రియాంకకి సినిమా మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత ఈ పాప తెలుగులో ఫుల్ బిజీ అవుతుందనే అనుకున్నారు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ భామకు వరుస అవకాశాలు ఏమీ రావడం లేదు. అడపాదడపా అవకాశాలొచ్చినా మంచి అవకాశం రాకపోతుందా అని ఆ చిన్న అవకాశాలు ఈ భామ కాలదన్నింది.

ప్రియాంక ఆశల మీద నీళ్లు…

అయితే మొన్నీమధ్యనే అలాంటి మంచి అవకాశం వచ్చినట్టే వచ్చి.. ప్రియాంకకి చేజారిందనే న్యూస్ వినబడుతుంది. ప్రియాంక జవాల్కర్ కి అక్కినేని హీరో అఖిల్ సరసన ఛాన్స్ వచ్చిందనే న్యూస్ బాగా హైలెట్ అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ చెయ్యబోయే సినిమాలో ప్రియాంక జవాల్కర్ ని హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారని అనే సరికి గీత ఆర్ట్స్ లో నటిస్తే ఈ భామకు తర్వాత పెద్ద హీరోలతో అవకాశాలొస్తాయన్నారు. కానీ తాజాగా ఈ సినిమాలో అఖిల్ సరసన ప్రియాంకని పక్కనపెట్టి మరో హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి అఖిల్ తో కలిసి నటిస్తే కాస్త కూస్తో ఫెమస్ అవుతాననుకున్న ప్రియాంక జవాల్కర్ ఆశల మీద నీళ్లుపోసినట్లే అయ్యింది.

Tags:    

Similar News