ఆ సంస్థపై కేసు వేస్తారంట..!

కళ్ళ ముందు కనిపించేది ఏది నిజం కాదు అని మరోసారి రుజువు అయింది. ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్ ప్రేమ, పెళ్లి వ్యవహారం గురించి తెలిసిందే. [more]

;

Update: 2019-04-03 06:19 GMT
priyanka nick divorce rumours
  • whatsapp icon

కళ్ళ ముందు కనిపించేది ఏది నిజం కాదు అని మరోసారి రుజువు అయింది. ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్ ప్రేమ, పెళ్లి వ్యవహారం గురించి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ లో ఈ జంట పెళ్లి చేసుకుంది. అయితే పెళ్ళై నాలుగు నెలలు కూడా కాకముందే ఈ జంట విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిందట. అయితే ఈ న్యూస్ ఇక్కడ నుండి వచ్చింది కాదు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత OK! మ్యాగజైన్ ఈ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తుంది. వీరు తొందర్లోనే విడాకులు తీసుకోనున్నారని కథనాన్ని వండి వార్చింది. దీంతో ప్రియాంక ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు.

తరచూ గొడవలట..?

నిక్ – ప్రియాంక మధ్య ఏవో గొడవలు ఉన్నాయని ఒకరంటే ఒకరికి పొసగడం లేదని… ఇద్దరి మధ్యా వయసు తేడా కూడా ఈ గొడవలకు కారణమని కథనం ప్రచురించింది. ఇద్దరి మధ్య పార్టీల విషయంలో ప్రతిదీ సమస్యగానే మారింది. అందుకే నిక్ ని ఫ్యామిలీ మెంబర్స్ ప్రియాంక నుండి విడిపోవాల్సిందిగా తొందరపెట్టారని సదరు కథనం పేర్కొంది. అయితే ఉన్నవి లేనివి కలిపి కట్టుకథలు రాసిన సదరు మ్యాగజైన్ పై ప్రియాంక, నిక్ లాయర్ల బృందం కోర్టులో కేసు వేయడానికి సిద్ధమవుతున్నారట. ఓకే మ్యాగజైన్ అందుకు తగిన మూల్యం చెలించుకోక తప్పదు.

Tags:    

Similar News