ఎవరూ మాట్లాడొద్దు... జగన్ అపాయింట్ మెంట్ ఇస్తే కలుస్తాం
ఏపీ లో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు నిర్ణయం పై ఎవరూ వ్యక్తిగతంగా స్పందించవద్వని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కోరారు.;
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు నిర్ణయం పై ఎవరూ వ్యక్తిగతంగా స్పందించవద్వని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కోరారు. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ అపాయింట్ మెంట్ ఇస్తే తాము వెళ్లి కలుస్తామని దిల్ రాజు అన్నారు. ఏపీ ప్రభుత్వం త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని, పాతరోజులు వస్తాయని దిల్ రాజు అన్నారు.
కమిటీ నిర్ణయం తర్వాతనే....
మరోవైపు సినిమా టిక్కెట్ల తగ్గింపు పై ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని, ఆ కమిటీలో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు సభ్యులుగా ఉంటారన్నారు.ఈ కమిటీతో ప్రభుత్వం చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. సినిమా టిక్కెట్ల రేట్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తామని దిల్ రాజు తెలిపారు. ఏపీ ప్రభుత్వం వేసిన కమిటీ నిర్ణయం తర్వాతనే దీనిపై ఎవరైనా మాట్లాడవచ్చని, అప్పటి వరకూ వ్యక్తిగతంగా ఎవరూ స్పందించవద్దని దిల్ రాజు కోరారు.