రాజ్ తరుణ్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?

హీరో రాజ్ తరుణ్ అవకాశాలు లేక సతమతం అవుతున్న టైములో ప్రేమ వ్యవహారం బయట పడింది. మీడియాకు విషయం తెలియడంతో ఆమె ఎవరూ? అసలు ఆమె ఎక్కడ [more]

;

Update: 2019-06-15 08:50 GMT

హీరో రాజ్ తరుణ్ అవకాశాలు లేక సతమతం అవుతున్న టైములో ప్రేమ వ్యవహారం బయట పడింది. మీడియాకు విషయం తెలియడంతో ఆమె ఎవరూ? అసలు ఆమె ఎక్కడ ఉంటుంది? సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన అమ్మాయేనా? అన్న విషయాలు బయటికి లాగడానికి మీడియా వారు చాలా ట్రై చేసారు కానీ రాజ్ తరుణ్ మాత్రం తను ఓ అమ్మాయిని ప్రేమించా అని మాత్రమే గతంలో చెప్పాడు. మిగిలిన విషయాలు ఏమి చెప్పలేదు. అయితే రీసెంట్ గా తను ఓ ఆంగ్ల పత్రికతో, తన ప్రియురాలు ఏ నగరానికి చెందిన అమ్మాయి? ఆమెతో పరిచయం ఎలా ఏర్పడింది? తదితర విషయాలను పంచుకున్నాడు.

తాము ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, అయితే తన ప్రియురాలికి చిత్ర పరిశ్రమతో ఎలాంటి సంబంధమూ లేదని రాజ్ తరుణ్ వెల్లడించాడు. ఆమె విజయవాడ కి చెందినా అమ్మాయి అని తనో వ్యాపారవేత్త అని, సింపుల్‌గా ఉండే తెలుగింటి అమ్మాయని తెలిపాడు. అందరి ద్రుష్టిలో పడడం ఇష్టంలేక ఆ అమ్మాయి ఎవరూ అనేది చెప్పడంలేదని చెప్పాడు. ఆరేళ్ల క్రితం వైజాగ్‌లో తన పుట్టినరోజును జరుపుకున్న సందర్భంగా తొలిసారిగా ఆమెను చూశానని..అప్పటినుండి ప్రేమించుకుంటున్నాం అని తెలిపాడు. తరుచూ మేము కలుసుకుంటూనే ఉంటాం అని తమ పెళ్లి కి తమ తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పారని చెప్పాడు. వచ్చే ఏడాది లో తాము పెళ్లి చేసుకోబోతున్నాం అని తెలిపాడు.

Tags:    

Similar News