ప్లాప్ కాంబినేషన్ తో సినిమా
ఉయ్యాలా జంపాల సినిమాతో వెండితెరకు పరిచయం యంగ్ హీరో రాజ్ తరుణ్ కు ఇప్పటివరకు చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు. ప్రస్తుతం అతని మార్కెట్ జీరో [more]
;
ఉయ్యాలా జంపాల సినిమాతో వెండితెరకు పరిచయం యంగ్ హీరో రాజ్ తరుణ్ కు ఇప్పటివరకు చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు. ప్రస్తుతం అతని మార్కెట్ జీరో [more]
ఉయ్యాలా జంపాల సినిమాతో వెండితెరకు పరిచయం యంగ్ హీరో రాజ్ తరుణ్ కు ఇప్పటివరకు చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు. ప్రస్తుతం అతని మార్కెట్ జీరో అయినా పరిస్థితిల్లో ‘గుండె జారి గల్లంతయ్యిందే’ లాంటి ఫుల్ ఎంటర్ టైనర్ తో హిట్ అందుకున్న కొండా విజయ్ కుమార్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ డైరెక్టర్ నితిన్ సినిమా తరువాత నాగ చైతన్య తో ‘ఒక లైలా కోసం’ తీసి డిజాస్టర్ అందించాడు.
మళ్లీ చాలా గ్యాప్ తరువాత విజయ్ కుమార్ రాజ్ తరుణ్ తో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఇందులో రాజ్ తరుణ్ వెరీ యాక్టివ్ గా ఉండే ఓ కుర్రాడు పాత్రలో నటించనున్నాడు. వయసులో పెద్దదైన ఓ అమ్మాయిని రాజ్ తరుణ్ ఇష్టపడతాడు. ఆ అమ్మాయిని సొంతం చేసుకునే పనిలో ఓ డ్రామా నడుస్తుంది. అది సినిమా హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈసినిమా ఆగస్టు నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. అనూప్ సంగీతం అందిస్తున్న ఈసినిమాలో స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుందట. త్వరలోనే మిగిలిన డీటెయిల్స్ తెలియనున్నాయి. ఈసినిమా హిట్ అవ్వడం ఇద్దరికీ చాలా అవసరం