ఈ ఫోటో వెనుక ఇంత కథ ఉందా..?

గత ఏడాది ప్రథమార్ధంలో రాజమౌళితో ఎన్టీఆర్, రామ్ చరణ్ సోఫాలో కూర్చున్న ఫోటో బయటకు వచ్చింది. ఆ ఒక్క ఫోటోతో ఎన్నోరకాల అనుమానాలు, ప్రశ్నలు అందరిలో తలెత్తాయి. [more]

Update: 2019-03-14 13:22 GMT

గత ఏడాది ప్రథమార్ధంలో రాజమౌళితో ఎన్టీఆర్, రామ్ చరణ్ సోఫాలో కూర్చున్న ఫోటో బయటకు వచ్చింది. ఆ ఒక్క ఫోటోతో ఎన్నోరకాల అనుమానాలు, ప్రశ్నలు అందరిలో తలెత్తాయి. జక్కన్న ఈ స్టార్స్ ఇద్దరితో పనిచేసాడు కాబట్టి పర్సనల్ గా పార్టీ ఇచ్చి సినిమా కమిట్ చేసాడా అనే అనుమానాలు కూడా మొలకెత్తాయి. తర్వాత కొన్నాళ్లకు వీరితో భారీ మల్టీస్టారర్ #RRR ని ఎనౌన్స్ చేసాడు. #RRR అంటే రామ్ చరణ్ – రాజమౌళి – రామారావు అన్నారు. అయితే తాజాగా జరిగిన #RRR ప్రెస్ మీట్ లో అసలు ఆ ఫొటో ఎలా పుట్టింది.. ఆ ఫోటో ఎప్పుడు దిగారు అనే దానికి రామ్ చరణ్ చెప్పిన సమాధానం మాత్రం ఆకట్టుకుంది.

రాజమౌళి ఇంటికి వెళ్లగా…

ఈ ఫోటో వెనుక స్టోరీ రామ్ చరణ్ చెబుతూ..‘‘ఒకరోజు ఏదో ఊరు వెళుతూ.. మధ్యలో రాజమౌళి ఇంటికి వెళ్లగా.. అక్కడ ఎన్టీఆర్ నేల మీద రిలాక్సడ్ మోడ్ లో కూర్చుని కనిపించాడు. ఏంటి తారక్ ఇక్కడున్నాడు అనుకొని.. ఏంటి బ్రో నువ్వేమిటి ఇక్కడ అని అడగాను. నన్ను చూసిన తారక్… చరణ్, మీరు ఏమైనా మాట్లాడుకోవాలా రాజమౌళి గారు.. నేను బయటికెళ్లనా అని అడిగాడు. కానీ రాజమౌళి కాసేపు మమ్మల్ని అలానే చూస్తూ సస్పెన్స్ క్రియేట్ చేసాక… మీరిద్దరూ ఆగండి. మీతో మాట్లాడాలి అంటూ నన్ను తారక్ ని లోపలి తీసుకెళ్లాడు. ఇక మేమిద్దరం ఊహించని #RRR కథ వినిపించాడు. కథ విన్న నేను, తారక్ ఒకరినొకరు చూసుకుని… వెంటనే లేచి రాజమౌళిని గట్టిగా పట్టుకుని ముగ్గురం కలిసి సోఫాలో కూర్చొని ఫోటో దిగాం’’ అంటూ ఆ ఫోటో వెనుక కథను చరణ్ ఆసక్తికరంగా వినిపించాడు.

Tags:    

Similar News