రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ RRR మల్టీస్టారర్ మూవీ ఆఫీషియల్ గా పట్టాలెక్కేసింది. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్, దృఢమైన శరీరంతో ఈ సినిమాలో అలరించబోతుంటే... రామ్ చరణ్ న్యూ లుక్ లోకి మారబోతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ RRR కోసం రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్ కి కొద్దిగా టైం ఉంది. అయితే ఈ సినిమాకి ఎన్టీఆర్, చరణ్ లు 200 రోజుల కాల్షీట్స్ ని రాజమౌళి కోసం కేటాయించారట. ఇక రాజమౌళి కూడా హీరోల బిజీ షెడ్యూల్ ని బట్టి ఈ సినిమా కోసం పక్కా ప్లానింగ్ తో చేశాడంటున్నారు. స్టార్ హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ బిజీ తెలుసు గనక వారిని ఇబ్బంది పెట్టకుండా RRR సినిమాని ఏడాదిన్నరలోనే కంప్లీట్ చెయ్యాలని రాజమౌళి భావించడమే కాదు ఎన్టీఆర్, చరణ్ కి మాటిచ్చినట్లుగా తెలుస్తుంది.
నివసించేందుకు ప్రత్యేకంగా సెట్ లు
అందుకోసమే అల్యూమినియం ఫ్యాక్టరీలో RRR కోసం ఒక ఇంటిని తాత్కాలికంగా రాజమౌళి నిర్మాస్తున్నాడని గతంలోనే ప్రచారం జరిగింది. RRR కి పనిచేసే టెక్నీషియన్స్ దగ్గర నుండి రాజమౌళి ఫ్యామిలీతో పాటు హీరోలు కూడా అక్కడే ఉండడానికి గానూ రాజమౌళి ఆ ఇంటి సెట్ ని నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఆ ఇంటి సెట్ కి దగ్గరలోనే RRR కి సంబందించిన స్పెషల్ సెట్స్, అలాగే గోల్కొండలో కూడా ఈ RRR కోసం స్పెషల్ సెట్స్ నిర్మాణం చేపట్టారట. ఇక రాజమౌళి నిర్మించిన ఇంటిలో ఎన్టీఆర్, చరణ్ కోసం ప్రత్యేకమైన రూమ్స్ ని హోటల్ గదులకు ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మించారట.
టైం వేస్ట్ కావద్దనే...
మరి రాజమౌళి ఏర్పాటు చేసిన స్పెషల్ సెట్స్ లోనే చాలాకాలం పాటు షూటింగ్ చేస్తారు కనుక హీరోలు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేందుకే రాజమౌళి ఇలా వారి కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశాడట. రోజు ఇంటికెళ్లి వస్తే చాలా టైం వెస్ట్ అవుతుందని... అదే అందుబాటులో ఉంటే సినిమాని అనుకున్న టైంకి అనుకున్నట్టుగా రెడీ చెయ్యొచ్చని రాజమౌళి ప్లాన్. మరి దీనిని బట్టి రామ్ చరణ్, ఎన్టీఆర్ హైదరాబాద్ లోనే షూటింగ్ జరుగుతున్నా అవుట్‌డోర్‌లో షూటింగ్ చేస్తున్నట్టే ఫిల్ అవ్వాలి.