వారి కోసం కుమారుడిని దింపిన రాజమౌళి

#RRR షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ తప్ప ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు రాజమౌళి. అయితే గత కొన్ని రోజులు [more]

;

Update: 2019-03-06 08:10 GMT
rajamouli sent karthikeya to convince bollywood star
  • whatsapp icon

#RRR షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ తప్ప ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు రాజమౌళి. అయితే గత కొన్ని రోజులు నుండి ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తో పాటు ఆలియా భట్ కూడా నటించనుందని టాక్. ఇంతవరకు దీని గురించి ఎక్కడా న్యూస్ రాలేదు కానీ ఆల్మోస్ట్ ఓకే అని టాక్. అయితే వీళ్లని ఎలాగైనా తీసుకుని రావాలని జక్కన్న ఫిక్స్ అయ్యాడట. అందు కోసం కొడుకు కార్తికేయకు ఆ బాధ్యతలను అప్పగించాడట.

త్వరలోనే సెట్స్ పైకి

వాళ్లని ఒప్పించడం పెద్ద విషయం కాదు కానీ వాళ్ల డేట్స్, రెమ్యూనరేషన్ గురించి ఒప్పించాలి కదా. చరణ్ – ఎన్టీఆర్ డేట్ లకు అనుగుణంగా వాళ్ల డేట్ లు కావాలి. బాలీవుడ్ లో వాళ్లకి ప్రీ కమిట్ మెంట్ లు చాలా ఉంటాయి. అందులో ఆలియా భట్ హీరోయిన్ ఫుల్ బిజీ. ఆమె డేట్స్ తో పాటు ఆమె రెమ్యూనరేషన్ గురించి అంతా రాజమౌళి కొడుకు కార్తికేయ దగ్గరుండి మరి చూసుకుంటున్నాడు. డేట్స్ తో పాటు ఇద్దరి రెమ్యూనరేషన్ కూడా ఫైనల్ అయితే #RRR సెట్స్ లో వారు త్వరలోనే కనిపించే అవకాశముంది.

Tags:    

Similar News