ఆ విషయంలో రాజమౌళి అడ్డంగా దొరికేసాడుగా?

రాజమౌళి సౌత్ లోనే నెంబర్ వన్ డైరెక్టర్ అందులో ఎలాంటి సందేహం లేదు. అసలు సౌత్ అనే కానన్ ఇండియా వైడ్ గానే రాజమౌళి అద్భుతమైన క్రియేటివ్ [more]

;

Update: 2020-04-24 02:51 GMT

రాజమౌళి సౌత్ లోనే నెంబర్ వన్ డైరెక్టర్ అందులో ఎలాంటి సందేహం లేదు. అసలు సౌత్ అనే కానన్ ఇండియా వైడ్ గానే రాజమౌళి అద్భుతమైన క్రియేటివ్ స్కిల్స్ కలిగిన డైరెక్టర్. రాజమౌళి సినిమాల్తో పోటీపడాలంటే మాములు కథలు చాలవనే ఫీలింగ్ లో బాలీవుడ్ డైరెక్టర్స్ ఉన్నారు అంటే.. రాజమౌళి ని చూసి వారు భయపడుతున్నారని అర్ధం. అయితే అలాంటి దర్శకుడు ఓ ఆస్కార్ అవార్డు సినిమాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెటిజెన్స్ కి రాజమౌళి అడ్డంగా దొరికేలా చేశాయి. RRR షూటింగ్ వాయిదా పడడంతో.. కోహ్లీగా ఉన్న రాజమౌళి RRR పనులను చక్కబెడుతూనే ఖాళీ సమయంలో హాలీవుడ్ మూవీస్ తోనూ, మీడియా తోనూ గడిపేస్తున్నాడు.

అయితే తాజాగా రాజమౌళి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న కొరియన్ మూవీ పారాసైట్ సినిమా చూసి బోర్ కొట్టి నిద్ర పోయా అని చెప్పాడు. ఆ సినిమాలో పెద్దగా విషయం లేదనిపించింది అని.. అందుకే ఆ సినిమా చూస్తూ నిద్రపోయా అంటూ ట్వీట్ చెయ్యడంతో… నెటిజెన్స్ కి కాలింది. రాజమౌళి క్రియేటివ్ అండ్ టాప్ డైరెక్టర్… కానీ ఆయన వరల్డ్ సినిమా అవార్డ్స్ లో అత్యున్నతమైనదిగా భావించే ఆస్కార్ గెలుకున్న మూవీ గురించి అంత చులకనగా మాట్లాడం.. బాగోలేదని రాజమౌళిని తప్పుబడుతున్నారు. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా మాట్లాడే రాజమౌళి.. ఆస్కార్ విన్నింగ్ మూవీ గురించి అలా మాట్లాడడం చాలామందికి నచ్చలేదు.

Tags:    

Similar News