'బాహుబలి' తరువాత రాజమౌళి ఓ భారీ మల్టీ స్టారర్ కి శ్రీకారం చుట్టాడు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ లను హీరో - విలన్ గా పెట్టి ఓ సినిమా ప్లాన్ చేసి గత నెల 19 నుండి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. రాజమౌళి సినిమాలంటే కచ్చితంగా ఏడాది పైనే పడుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ ఏ విషయంలోనూ కంప్రమైజ్ కాకుండా తీసే రాజమౌళి #RRR ఫస్ట్ షెడ్యూల్ ను అప్పుడే కంప్లీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. కేవలం 17 రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేయడంతో ఎవరికీ అర్ధం కాక షాక్ లో ఉన్నారు. మొదట షెడ్యూల్య్ లో ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల పై ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని హైదరాబాద్ శివారులో వేసిన సెట్లో చిత్రీకరించారు.
షెడ్యూల్ అయిపోయింది.. ఓటేస్తున్నా...
అయితే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని రాజమౌళి ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. మరి ఫస్ట్ షెడ్యూల్ కింద ఫైట్ సీక్వెన్స్ ఒక్కటే ప్లాన్ చేశాడా? లేదా కొన్ని సీన్ కూడా షూట్ చేశాడా అన్న విషయాలు పై క్లారిటీ లేదు. #RRR ఫస్ట్ పూర్తయిందని... ఇప్పుడు నా ఓటు హక్కు ను వినియోగించుకునేందుకు వెళుతున్నానని.. మీరు కూడా కూడా ఓటు వేయాలని కోరారు. మరి మీరు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా ? ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మన భవిష్యత్తు నిర్మాణం కోసం ఈ గౌరవాన్ని స్వీకరిద్దాం. ఈరోజు కచ్చితంగా అంతా ఓటు వేయండి" అని రాజమౌళి ట్విట్టర్ లో వెల్లడించాడు.