రజనీకాంత్ ‘పేట’ కొత్త రికార్డు

మన ఇండియాలో సూపర్ స్టార్ రజనీకి ఉన్న ఫ్యాన్స్ మరే హీరో కి ఉండరు. రజనీకి ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. రజనీ [more]

;

Update: 2019-01-17 06:25 GMT
petta new record
  • whatsapp icon

మన ఇండియాలో సూపర్ స్టార్ రజనీకి ఉన్న ఫ్యాన్స్ మరే హీరో కి ఉండరు. రజనీకి ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. రజనీ సినిమాలు వస్తున్నాయి అంటే విదేశాల్లో ఉన్న ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తుంటారు. మరి తమిళనాడులో ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. రీసెంట్ గా అంటే పండగ కానుకగా రజనీ పేట రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం వారం రోజుల్లో 150 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

వాటికంటే చాలా బెటర్

రజనీ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా బెటర్ అని చెబుతున్నారు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రజనీని యంగ్ గా, స్టైలీష్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. కంటెంట్ పరంగా కూడా సినిమా బాగుండడంతో ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. కానీ తెలుగు పేట అంత గొప్పగా ఆడటం లేదని ట్రేడ్ చెబుతుంది.

Tags:    

Similar News