Rajinikanth : రజిని దంపతులు తమ పెళ్లిరోజుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా..!

రజినీకాంత్ దంపతులు తమ పెళ్లిరోజుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా..? ఈ విషయాన్ని రజిని కుమార్తె తెలియజేసారు.;

Update: 2024-02-28 07:59 GMT
Rajinikanth : ప్రొఫిషినల్ లైఫ్ లో సూపర్ స్టార్ అనిపించుకున్న రజినీకాంత్.. పర్సనల్ లైఫ్‌లో కూడా సూపర్ హస్బెండ్ అనిపించుకున్నారు. 1981లో లతాని పెళ్లి చేసుకున్న రజిని.. ఆమెతో పాటు 43ఏళ్ళగా ప్రయాణిస్తూ హస్బెండ్ కూడా రోల్ మోడల్ అనిపించుకుంటున్నారు. ఫిబ్రవరి 26న తిరుపతిలో పెళ్లి చేసుకున్న ఈ జంట.. ప్రతి సంవత్సరం తమ మ్యారేజ్ డేని ప్రత్యేకంగా జరుపుకుంటారంట.
ఈ విషయాన్ని వీరి కుమార్తె సౌందర్య తెలియజేసారు. తమ పేరెంట్స్ కి మ్యారేజ్ డే విషెస్ తెలియజేస్తూ.. సౌందర్య ఒక ఆసక్తికర విషయాన్ని అభిమానులకు తెలియజేసారు. 43 సంవత్సరాలు క్రిందట తమ పెళ్లి సమయంలో ఒకరికి ఒకరు మార్చుకున్న ఉంగరాలను.. ప్రతి ఏడాది పెళ్లిరోజున మళ్ళీ ధరించి రజినీకాంత్ దంపతులు తమ మ్యారేజ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటారంట.
ఇక ఈ ఏడాది కూడా అలాగే జరుపుకోగా.. సౌందర్య అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేశారు. ఆ పిక్ లో రజిని, లతా.. తమ ఉంగరాలను చూపిస్తూ కనిపిస్తున్నారు. సౌందర్య తెలియజేసిన ఈ ఆసక్తికర విషయం అందర్నీ ఆకట్టుకుంటుంది. కాగా లతా కూడా మూవీస్ లో వర్క్ చేశారు. గాయకురాలిగా, నిర్మాతగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా సినిమా రంగంలో సేవలు అందించారు.
Tags:    

Similar News