హ్యాండిచ్చాడా..? చేస్తున్నాడా..?

Update: 2018-12-05 06:47 GMT

తమిళంలో టాలెంటెడ్ దర్శకుడు మురుగదాస్ సినిమాలు వస్తున్నాయంటే... అన్ని వర్గాల ప్రేక్షకులకు మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. మురుగదాస్ స్టోరీ, మేకింగ్ స్టయిల్, డైరెక్షన్ స్కిల్స్ అంత బాగుంటాయి. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు వస్తున్నాయి అంటే దేశ విదేశాల్లోనూ హడావిడి ఉంటుంది. మరి సౌత్ సూపర్ స్టార్ అని పిలిచే రజినీకాంత్ తో మురుగదాస్ జోడి కడితే ఆ సినిమాకి వచ్చే క్రేజ్ ఆకాశాన్నంటుతుంది. అయితే ప్రస్తుతం మురుగదాస్, రజినీకాంత్ కూడా అటు ఇటు కానీ సినిమాలతోనే ఉన్నారు. అటు ఇటు కాని అని ఎందుకన్నామంటే.. మురుగదాస్ స్పైడర్ అట్టర్ ఫ్లాప్ కాగా.. రజినీకాంత్ కాలా, కబాలి సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

మురుగదాస్ తో రజినీ...

ఇక మురుగదాస్ - విజయ్ ల సర్కార్ కి నెగెటీవ్ టాకొచ్చినా కలెక్షన్స్ బాగున్నాయి. ఇక రజినీకాంత్ - శంకర్ ల తాజా చిత్రం 2.ఓ పరిస్థితి అదే మాదిరిగా ఉంది. ప్రేక్షకులు యావరేజ్ టాకిచ్చినా... క్రిటిక్స్ 2.ఓ ని హిట్ చేశారు. అయితే ఫస్ట్ వీకెండ్ 2.ఓ కలెక్షన్స్ బాగున్నప్పటికీ... వర్కింగ్ డేస్ లో 2.ఓ కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి. ఇక రజినీకాంత్ 2.ఓ సినిమా విడుదలకు ముందే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పెట్టా లో నటిస్తున్నాడు. ఆ సినిమా కూడా వచ్చే సంక్రాంతికే విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రం తర్వాత రజినీ పాలిటిక్స్ లో బిజీ అవుతాడనుకుంటే.. మురుగదాస్ తో కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసే యోచనలో ఉన్నాడంటున్నారు. మరోపక్క సూపర్ స్టార్ మురుగదాస్ కి హ్యాండ్ ఇచ్చాడనే టాక్ కూడా నడుస్తుంది.

రాజకీయ నేపథ్యంతోనే...

ఎందుకంటే రజినీకాంత్ పొలిటికల్ గా కెరీర్ లో బిజీ కాబోతున్నాడంటున్నారు. సర్కార్ సినిమా హడావిడి ముగియగానే మురుగదాస్ సూపర్ స్టార్ కథ మీదే కూర్చున్నాడట. కథపై కసరత్తు పూర్తి చేసిన మురుగదాస్... అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశాడట. మరి రజినీకాంత్ - మురుగదాస్ సినిమా కథ మొత్తం రాజకీయాల నేపథ్యంలోనే ఉంటుందని చెబుతున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా విషయం అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా తెలుస్తుంది.

Similar News