Ayodhya Ram Mandir : అయోధ్యలో పవన్ కళ్యాణ్, రజినీకాంత్..

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రజినీకాంత్, పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నారు.;

Update: 2024-01-21 13:03 GMT
Ayodhya Ram Mandir : రేపు జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరగబోయే రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం దేశమంతా ఎదురు చూస్తుంది. ఇక ఈ మహత్తర వేడుకకు హాజరుకావాలంటూ రాజకీయ రంగంతో పాటు సినీ, క్రీడా రంగంలోని పలువురు ప్రముఖులకు ఆహ్వానం వెళ్లిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే పవన్ కళ్యాణ్, రజినీకాంత్ కి కూడా ఆహ్వానం వెళ్ళింది.
దీంతో రేపు జరగబోయే మహత్తర కార్యక్రమం కోసం నేడు వీరిద్దరూ అయోధ్యకు చేరుకున్నారు. అందుకు సంబందించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అక్కడ దిగిన పవన్ కళ్యాణ్ రామ మందిరం ప్రారంభోత్సవం గురించి మాట్లాడుతూ.. "ఇది 500 ఏళ్ళ కల. ఇప్పుడు నిజం అవుతుంది. అందరితో పాటు నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాను" అంటూ వ్యాఖ్యానించారు.
కాగా ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్ కూడా సతీసమేతంగా వెళ్ళబోతున్నారు. టాలీవుడ్ నుంచి వీరికి మాత్రమే ఆహ్వానాలు అందినట్లు ప్రస్తుతానికి తెలుస్తుంది. ఇక మహత్తర కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో బిగ్ స్క్రీన్ పై చూసేలా ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్.. తమ థియేటర్స్ లో షో వేయబోతున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ టికెట్స్ కూడా అమ్ముతున్నారు. టికెట్ ధర రూ.100 కాగా, దేశంలోని 160కి పైగా థియేటర్లలో ఈ లైవ్ టెలికాస్ట్ ఉండబోతుంది.
Tags:    

Similar News