తమిళ సీన్స్ ని కాపీ పేస్ట్ చేస్తున్నారా?
తమిళంలో సూపర్ హిట్ అయినా థ్రిల్లర్ మూవీ `రాక్షసన్`ని తెలుగులో బెల్లంకొండ హీరోగా `రాక్షసుడు` అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న [more]
;
తమిళంలో సూపర్ హిట్ అయినా థ్రిల్లర్ మూవీ `రాక్షసన్`ని తెలుగులో బెల్లంకొండ హీరోగా `రాక్షసుడు` అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న [more]
తమిళంలో సూపర్ హిట్ అయినా థ్రిల్లర్ మూవీ 'రాక్షసన్'ని తెలుగులో బెల్లంకొండ హీరోగా 'రాక్షసుడు' అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను నిజానికి మొదట నితిన్ చేయాలి కానీ చేయలేదు. ఇప్పుడు అతని ప్లేస్ లో కి బెల్లంకొండ వచ్చాడు. అయితే తమిళంలో ఉన్న సీన్లు చాలా వరకూ కట్ పేస్ట్ చేశారని, తెలుగులో షూటింగ్ చేసింది చాలా తక్కువని వార్తలొచ్చాయి. ఇప్పుడు చిత్ర యూనిట్ ఇంకోలా చెబుతుంది. వారి వర్షన్ వేరేలా ఉంది.
ఈమూవీలో ఎత్తేసిన సీన్లు లేవని, ప్రతీ సీన్ రీషూట్ చేశామని చెబుతున్నారు. కథలో కూడా కొన్ని మార్పులు చేశామని ప్రతి సీన్ రీషూట్ చేసాం అని చెబుతున్నారు. క్వాలిటీ, కంటెంట్ విషయంలో తమ బృందం ఏమాత్రం రాజీ పడడం లేదని..షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉందని చెబుతున్నారు. ఒకవేళ తమిళ సీన్స్ కాపీ పేస్ట్ చేస్తే సినిమా ఈపాటికే పూర్తి కావాలని చెబుతున్నారు. మరి ఏది నిజమో తెలియాలంటే మరో నెల రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది అప్పుడు తెలిసిపోతుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయినా 'రాక్షసుడు' టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా ఎలా ఉంటాదో చూడాలి…