రకుల్ ఓ కొత్త చిట్కా కనుగొంది

మిగిలిన సినీ పరిశ్రమల్లో ఏమో కానీ మన టాలీవుడ్ లో హీరోయిన్స్ కి షెల్ఫ్‌ లైఫ్‌ చాలా తక్కువ. హీరోలకి ఏళ్ళ తరబడి ఉన్న డిమాండ్ హీరోయిన్స్ [more]

;

Update: 2019-04-21 05:04 GMT

మిగిలిన సినీ పరిశ్రమల్లో ఏమో కానీ మన టాలీవుడ్ లో హీరోయిన్స్ కి షెల్ఫ్‌ లైఫ్‌ చాలా తక్కువ. హీరోలకి ఏళ్ళ తరబడి ఉన్న డిమాండ్ హీరోయిన్స్ కి ఉండదు. చాలా తక్కువ మందికే అలా ఉంటుంది. అయితే కెరీర్‌ పొడిగించుకోవడం ఎలాగనేది హీరోయిన్లకి తెలిసుండాలి. రకుల్ ప్రీత్ సింగ్ కి ఈవిషయం బాగా తెలుసు అందుకే తన కెరీర్ కి ఏమి డోకా లేకుండా చూసుకుంటుంది.

ఒకప్పుడు ఒక ఊపు ఊపేసిన రకుల్ తో ఇప్పుడు యంగ్ హీరోస్ ఎవరూ చేయడానికి ఇష్టపడంలేదు. అందుకే ఆమె ఓ చిట్కా కనుగొంది. యంగ్ హీరోస్ కాదంటేనేం తను నటిస్తే సంబరపడే సీనియర్లతో నటించడానికి సిద్ధపడింది. ఏజ్డ్‌ హీరోస్ తో నటించాల్సి వస్తే తన పాత్ర కె ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటుంది ఈ బ్యూటీ. అందుకు తగ్గ జాగ్రత్తులు కూడా తీసుకుంటుంది.

ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో అజయ్‌ దేవ్‌గన్‌తో ‘దే దే ప్యార్‌ దే’తో పాటు నాగార్జునతో ‘మన్మథుడు 2’ చేస్తోంది. ఆమె పెద్ద హీరోలతో నటిస్తున్న అనే ఫీల్ అవ్వకుండా ఆ సినిమాలు రిలీజ్ అయినా తరువాత తన ఏజ్‌కి తగ్గ ఇమేజే కంటిన్యూ అయ్యేలా కేర్‌ తీసుకుంది. సీనియర్ హీరోలతో నటిస్తున్నప్పుడు ఆమె పారితోషికం కూడా గట్టిగానే తీసుకుంటుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది.

Tags:    

Similar News