సినిమా సినిమానే.. వ్యాపారం వ్యాపారమే

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ బిజీగా గడిపిన రోజుల్లోనే హీరోయిన్ రకుల్ ప్రీత్ సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. [more]

Update: 2019-09-15 06:44 GMT

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ బిజీగా గడిపిన రోజుల్లోనే హీరోయిన్ రకుల్ ప్రీత్ సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. సినిమాలు సినిమాలే, వ్యాపారం వ్యాపారమే అన్నట్టుగా.. ముందు నుండి రకుల్ ప్రీత్ ప్లానింగ్ వేరు. మొదటునుండి బాడీ వర్కౌట్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే రకుల్ F45 అంటూ జిమ్ సెంటర్స్ ని ఓపెన్ చేసింది. రకుల్ జిమ్ వ్యాపారం చాలా నగరాల్లో పాపులర్ అయ్యింది. ఇక తాజాగా సినిమా అవకాశాలు కూడా తగ్గిన రకుల్ మరో వ్యాపారంలోకి అడుగెట్టినట్లుగా తెలుస్తుంది.

తాజాగా రకుల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లో ఓ జట్టుకి కో-ఓనర్ గా మారింది. రకుల్ ప్రీత్ ఫైన్ క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ జట్టుని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ లో జరగనున్న ఈ ఈవెంట్ లో రకుల్ జట్టు బరిలో నిలుస్తుంది. మరి ఈ విషయాన్నీ రకుల్ స్వయానా తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. మరి తెలుగులో సినిమాలు లేకపోయినా.. తమిళ, బాలీవుడ్ లో మాత్రం కాస్త బిజీగా వున్న రకుల్.. ఇలా నయా బిజినెస్ లకు శ్రీకారం చుట్టి మంచిగా సెటిల్ అవుతుందనిపిస్తుంది..

Tags:    

Similar News