రకుల్ కి ఇలా అయితే కష్టమే..!

ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు లేని రకుల్ ప్రీత్ సింగ్ తమిళ్, హిందీ సినిమాల్లో బాగానే బిజీగా ఉంది. తెలుగులో కేవలం వెంకిమామ సినిమాలో నాగ చైతన్యకి [more]

Update: 2019-02-16 06:48 GMT

ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు లేని రకుల్ ప్రీత్ సింగ్ తమిళ్, హిందీ సినిమాల్లో బాగానే బిజీగా ఉంది. తెలుగులో కేవలం వెంకిమామ సినిమాలో నాగ చైతన్యకి జోడిగా ఎంపికైంది రకుల్. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇక తమిళంలో మాత్రం అన్నదమ్ములు సూర్య, కార్తీ సినిమాల్లో నటిస్తుంది. ఇప్పటికే కార్తీతో నటించిన దేవ్ సినిమా తెలుగు, తమిళంలో నిన్న వాలెంటైన్స్ డే రోజున విడుదలైంది. అలాగే అన్న సూర్య ఎన్జీకే సినిమా టీజర్ కూడా నిన్న లవర్స్ డే రోజునే విడుదలైంది. మరి ఎన్జీకే టీజర్ ఫర్వాలేదనిపించింది. కానీ దేవ్ తోనే రకుల్ కి ఏ లాభమూ లేకుండా పోయింది.

అసలు ఎందుకు ఉన్నారో…

నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దేవ్ సినిమాకి ఫస్ట్ షోకే నెగెటివ్ టాక్ రావడంతో.. సినిమా లో నటించిన రకుల్ కి ఎదురుదెబ్బ తగిలింది. దేవ్ సినిమాని ఒక డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించాడు. సినిమాలో హీరోహీరోయిన్స్ క్యారెక్టరైజేషన్స్ సరిగ్గా లేకపోవడంతో… సినిమాలో నటించిన కార్తీకి అలాగే రకుల్ కి ఆ సినిమా తో పెద్దగా పేరు రాలేదు. ఏదో రకుల్ గ్లామర్ తో కాస్త మైమరపించినా… సినిమాలో రకుల్ పాత్రని ఎందుకు పెట్టారో అర్ధం కాదు. మేఘన అనే యంగ్ బిజినెస్ వుమన్ గా రకుల్ గ్లామర్ గా కనబడింది కానీ.. ఆమె పాత్రకి అస్సలు స్కోప్ లేదు. ఇక సాంగ్స్ లో రకుల్ అందాల ఆరబోత బాగున్నప్పటికీ సినిమాకి నెగెటివ్ టాక్ రావడం రకుల్ పాలిట శాపంలా మారింది.

ఇలా అయితే గడ్డుకాలమే…

అలాగే సినిమాలో కొన్నిచోట్ల రకుల్ లుక్ తేడాగా అనిపిస్తుంది. రకుల్ కు మేకప్ అంతగా నప్పలేదు. మరికొన్ని సీన్స్ లో రకుల్ ఏదో మొక్కుబడిగా నటించేసింది. అలాగే మరికొన్ని సీన్స్ లో రకుల్ అబ్బాయిలా క‌నిపించింది. అలా ఉంటే.. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ ఎక్క‌డ వ‌ర్క‌వుట్ అవుతుంది. మరి ఈ సినిమా దెబ్బకి రకుల్ ప్రీత్ కి ఫ్యూచర్ అర్ధమై ఉంటుంది. తెలుగులోనే కాదు.. ఇక తమిళంలోనూ రకుల్ కి గడ్డు కాలం మొదలైనట్టే.

Tags:    

Similar News