ఎన్టీఆర్ ఇలా ఉన్నాడేంటి..?

#RRR చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో రాజమౌళి మొన్న ప్రెస్ మీట్ లో చెప్పేసారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తుండగా… కొమరం భీమ్ [more]

Update: 2019-03-16 08:39 GMT

#RRR చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో రాజమౌళి మొన్న ప్రెస్ మీట్ లో చెప్పేసారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తుండగా… కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. మనకేమో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ అనగానే వాళ్ల రూపాలు ఓ రకంగా గుర్తుకొస్తాయి. జక్కన్న మనకు తెలియని స్టోరీ చూపిస్తున్నాడు కాబట్టి లుక్స్ విషయంలో లిబర్టీ తీసుకోవచ్చు. అంటే రాజమౌళి ఇద్దరినీ ఫిట్ గానే చూపిస్తాడు.

బొద్దుగా కనిపిస్తున్న ఎన్టీఆర్

కానీ నిన్నటి ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ ఫిట్ గానే ఉన్నాడు కానీ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ టైంలో మాదిరి బొద్దుగా తయారయ్యాడు. అతను ఫిట్ నెస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు లేడు. మరి ఇన్ని రోజులు జరిగిన చిత్రీకరణలో ఎన్టీఆర్ ఇలాంటి లుక్ తో ఎలా మేనేజ్ చేశాడా అన్నది ప్రశ్న. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇంతేనా? లేదా బరువు తగ్గి చరణ్ లాగా ఫిట్ గా మారతాడా లేక కొమరం భీమ్ కొంచెం బొద్దుగా ఉన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తారా చూడాలి.

Tags:    

Similar News